
ఇంతకీ మంత్రి కేటీఆర్ ఏం ట్వీట్పై పంచాంగం చెప్పారంటే, “ఆదాయం: అదానీకి! వ్యయం: జనానికి, బ్యాంకులకు! అవమానం: నెహ్రూకి! రాజపూజ్యం: గుజరాతీ గుంపుకి!! బస్, బభ్రాజీమానం భజగోవిందం! దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం!” అని వేయగా దానికి బండి సంజయ్ ఏమని సమాధానం ఇచ్చారంటే, “ఆదాయం : కల్వకుంట్ల కుటుంబానికి వ్యయం : తెలంగాణ రాష్ట్రానికి అవమానం : ఉద్యమ వీరులకు, అమరుల త్యాగాలకు రాజపూజ్యం : ఉద్యమ ద్రోహులకు, దొంగలకు !! తుస్.., పిట్టల దొర, తుపాకి చంద్రుల గడీల పంచాతీ లెక్క తేలుడే తరువాయి…పతనం ఇగ షురువాయే,” అని బదులిచ్చారు.
ఆదానీ విషయంలో ప్రధాని నరేంద్రమోడీని అందరూ ఏవిదంగా వేలెత్తి చూపుతున్నారో, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం ప్రాజెక్టుల పేరుతో భారీగా అవినీతికి పాల్పడి భారీగా ఆస్తులు పోగేసుకొందని ప్రతిపక్షాలు వేలెత్తి చూపుతున్నాయి. అమరవీరులను పక్కన పడేసి ఉద్యమ ద్రోహులను కేసీఆర్ చంకనెక్కించుకొన్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. అదే… బండి సంజయ్ ఈవిదంగా చెప్పారు.
The TDP, despite being the ruling party in Andhra Pradesh, has agreed to share a…
The Indian selection committee has announced the Test and ODI squads for the upcoming tour…