
కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఉండిపోయి బీఆర్ఎస్ పార్టీని ‘ట్రయల్ రన్’ కోసం కొడుకు కేటీఆర్‌కి అప్పగిస్తే ఏడాదిలోనే ఆ పార్టీని అస్తవ్యస్తం చేసుకున్నారు.
పార్టీని బీజేపీలో విలీనం చేసేయాలనుకున్నారని ఆయన సొంత చెల్లెలు కల్వకుంట్ల కవిత చెప్పడమే ఇందుకు నిదర్శనం. ఈ విషయం ఆమె బయటపెట్టిన తర్వాత కూడా ఆమె మాటలను కేటీఆర్ ఖండించలేదంటే అర్దం ఎమిటి?
తన నాయకత్వాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని ఆమె చెపుతుంటే కేటీఆర్ ఆమెకు జవాబు చెప్పలేకపోతున్నారు.
బీసీ రిజర్వేషన్స్ అంశంలో కూడా కేటీఆర్‌కి క్లారిటీ లేకనే ధర్నాలు చేశారని కల్వకుంట్ల కవిత విమర్శిస్తే దానికీ జవాబు చెప్పలేకపోయారు.
తాజాగా ఏపీ మంత్రి నారా లోకేష్‌తో రహస్యంగా కేటీఆర్ భేటీ అయ్యారని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి మరో బాంబు పేల్చారు.
బీజేపీలో విలీనం వార్త వలన బీఆర్ఎస్ పార్టీ విశ్వసనీయత ఎంతగా దెబ్బ తిందో, నారా లోకేష్‌తో రహస్య భేటీ వలన కూడా అంతే దెబ్బ తింటుందని వేరే చెప్పక్కరలేదు.
2019 ఎన్నికలలో జగన్‌తో కేసీఆర్ చేతులు కలిపి చంద్రబాబు నాయుడుని గద్దె దించారు. నేటికీ చంద్రబాబు నాయుడుని విమర్శిస్తూ ఆయన పేరు చెప్పుకొని తెలంగాణ సెంటిమెంట్ రాజేసుకుంటూ చవుకబారు రాజకీయాలు చేస్తూనే ఉన్నారు.
కనుక ఇప్పుడు నారా లోకేష్‌తో కేటీఆర్ రహస్యంగా భేటీ అయితే బీఆర్ఎస్ పార్టీ విశ్వసనీయత దెబ్బ తింటుంది కదా? అందుకే రేవంత్ రెడ్డి ఆరోపణ చేస్తే ఎలా జవాబు చెప్పుకోవాలో తెలీక కేటీఆర్ మౌనంగా ఉండిపోయారని భావించవచ్చు. రెండు రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చినప్పుడైనా గట్టిగా ఖండించలేకపోయారు.
తన కంటే వయసులో, అనుభవంలో చాలా పెద్దవారైన చంద్రబాబు నాయుడుని జగన్ జైల్లో పెట్టిస్తే, కేటీఆర్ ఎంత చులకనగా అవహేళనగా మాట్లాడారో అందరూ విన్నారు.
కానీ ఈరోజు ప్రెస్‌మీట్‌లో “నారా లోకేష్ నాకు తమ్ముడు లాంటివాడు. మా ఇద్దరికీ మంచి స్నేహం ఉంది. పైగా నారా లోకేష్ నాలాగే యువకుడు.. పొరుగు రాష్ట్రంలో మంత్రి. ఆయనని నేను కలువలేదు. అయినా కలిస్తే తప్పేమిటి? ఆయనేమీ నీలాగా (రేవంత్ రెడ్డి)లాగా ఢిల్లీకి మూటలు మోయడం లేదు. నీలాగ దొంగతనం చేసి దొరికిపోలేదు కదా? ఆయనేమీ నీలా లోఫర్ కాదు కదా?” అని కేటీఆర్ అన్నారు.
“నారా లోకేష్‌ని నేను కలువలేదు,” అని గట్టిగా ఖండించకుండా ఈవిదంగా మాట్లాడి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణ నిజమే అని అందరూ భావించేలా చేశారు.
నారా లోకేష్ నాకు తమ్ముడు, స్నేహితుడు అంటూనే మళ్ళీ ఈవిదంగా వెటకారంగా వంకర టింకర మాటలు మాట్లాడి, ఒకవేళ నిజంగానే సత్సంబంధాలు ఉన్నట్లయితే అదీ చెడగొట్టుకున్నారు కదా?
తెలంగాణ ఏర్పడిన తర్వాత టీడీపీని దెబ్బ తీసి, చంద్రబాబు నాయుడుని రాష్ట్రం నుంచి తరిమికొట్టామని గొప్పగా చెప్పుకొని, నేటికీ ఆయనని ఈసడించుకుంటూ నారా లోకేష్ నాకు తమ్ముడు, స్నేహితుడు అంటే నలుగురూ నవ్వరా?
బీఆర్ఎస్ పార్టీ ‘ట్రయల్ రన్’లో కేటీఆర్ ఫెయిల్ అయ్యారు కనుక కారు స్టీరింగ్ హరీష్ రావు లేదా కల్వకుంట్ల కవిత చేతికి అప్పగించి వెనుక సీటులో కూడా సేద తీరితే మంచిదేమో?
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…