
KTR Faces a New Challenge Ahead of GHMC ElectionsKTR and KCR ahead of GHMC elections
ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలను మనం ఏవిధంగా ఆసక్తిగా గమనిస్తామో, అదేవిధంగా ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడాన్ని ఇరుగు పొరుగులు కూడా గమనించే ఉంటారు.
కానీ వీటిపై స్పంచడం తప్పనిసరి కాదు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. కనుక దాని తెలంగాణ దోస్త్ బీఆర్ఎస్ పార్టీ మౌనంగా ఉండిపోయింది.
ఒకవేళ ఈ ఎన్నికల్లో వైసీపీ గెలవకపోయినా కనీసం ఎక్కువ స్థానాలు గెలుచుకొని ఉండి ఉంటే, తమ్ముడు కేటీఆర్ ఏదో అన్నకు అభినందనలు తెలిపేవారు లేదా ఓ సందర్భం చూసుకుని పాలకులు తీరు సరిగ్గా లేకపోతే ఏమవుతుందో తెలుసుకునేందుకు ఈ ఎన్నికల ఫలితాలే ఒక ఉదాహరణ అంటూ మనసులో మాట చెప్పేవారే.
కనీసం బీఆర్ఎస్ పార్టీ తరపున వారి సొంత మీడియాలో వైసీపీకి అనుకూలంగా వ్రాసి, జగన్‌తో మా స్నేహం చెక్కు చెదరలేదని స్పష్టం చేసేవారే. కానీ తమ్ముడికి ఈ అవకాశం ఇవ్వకుండా చేసుకున్నారు జగన్.
వైసీపీ పరిస్థితి గురించి తాపీగా ఆలోచించవచ్చు. కానీ త్వరలో హైదరాబాద్ మేయర్, జిహెచ్‌ఎంసి ఎన్నికలు కూడా జరుగబోతున్నాయి. మరి వాటిని ఎదుర్కొనేందుకు కేటీఆర్ సిద్ధంగా ఉన్నారా?
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2016లో జరిగిన జిహెచ్‌ఎంసి ఎన్నికలలో అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసి, బీఆర్ఎస్ పార్టీని గెలిపించే బాధ్యత కొడుకు కేటీఆర్‌కు అప్పగిస్తే అయన గెలిపించారు.
కానీ ఇప్పుడు కేసీఆర్ ఫామ్‌హౌసులో కాలక్షేపం చేస్తున్నారు. పైగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సిఎం రేవంత్ రెడ్డి ఎన్నికల వ్యూహాల ముందు కేటీఆర్ వ్యూహాలు పనిచేయవని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలోనే నిరూపితమైంది. మరీ ముఖ్యంగా మజ్లిస్ అధినేతలు ఓవైసీలు రేవంత్ రెడ్డి వైపున్నారు. బిజేపి హిందూ ఓట్లను, మజ్లిస్ ముస్లిం ఓట్లను పంచుకోగా మిగిలిన సెక్యులర్ ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడే అవకాశం ఉంటుంది.
కనుక 2016 ఎన్నికల నాటి అనుకూల పరిస్థితి ఇప్పుడు లేదు. అయినా జిహెచ్‌ఎంసి ఎన్నికలలో కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని మళ్ళీ ‘నాన్నకు ప్రేమతో…’ జిహెచ్‌ఎంసి విజయాన్ని అందించగలరా? డౌటే!
Produced by Venky Kudumula under the banner of What Next Entertainments and directed by Mahesh…
మాజీ ఐపీఎస్ అధికారి ఏబీవీ రావు కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో హఠాత్తుగా విజయవాడ మేయర్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో…