Telugu

లక్ష కోట్ల అవినీతి… కేటీఆర్ ఇక్కడ కూడా జగన్ తో పోలికేనా.?

వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్ రాజకీయ జీవితానికి కల్వకుంట్ల చంద్రశేఖర్ రెడ్డి కుమారుడు కేటీఆర్ రాజకీయ పప్రయాణానికి కొన్ని విషయాలలో చాల దగ్గర పోలికలు కనిపిస్తాయి. జగన్ కు సొంత చెల్లితో రాజకీయ విభేదాలు అలాగే కేటీఆర్ కి సైతం కవిత తో రాజకీయ శత్రుత్వం.

జగన్ తన తండ్రి రాజకీయ ఛరిష్మాతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు, అదే విధంగా కేటీఆర్ సైతం కేసీఆర్ నీడలోనే రాజకీయాలు చేస్తున్నారు. అలాగే జగన్ కు రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబే, కేటీఆర్ రాజకీయ ప్రత్యర్థుల ఖాతాలో బాబుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.

ADVERTISEMENT

ఇలా అనేక అంశాలలో జగన్, కేటీఆర్ ఇద్దరినీ సరిపోల్చి విశ్లేషించవచ్చు. అయితే ఇప్పుడు ఆ ఇద్దరి నేతలను మరో విషయంలోకి కూడా పోల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే లక్ష కోట్ల అవినీతి. లక్ష కోట్ల అవినీతి అనగానే రెండు తెలుగు రాష్ట్రాలలో టక్కున గుర్తుకొచ్చే పేరు వైఎస్ జగన్.

తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎంపీగా ఉన్న జగన్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ బయటకొచ్చిన వార్తలు నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెను సంచలంగా మారాయి.

రాజకీయ నాయకల పై అవినీతి ఆరోపణలు కొత్తేమి కాదు, కానీ ఇలా తండ్రి సీఎం గా ఉన్న 5 సంవత్సరాల 3 నెలల వ్యవధిలో ఈ స్థాయిలో లక్ష కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కున్న మొట్టమొదటి రాజకీయ నాయకుడిగా జగన్ పేరు నాడు మీడియాలో మారుమోగిపోయింది.

వైఎస్ జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ ఆయన పై అనేక ఆరోపణలు, సీబీఐ విచారణలు, అక్రమాస్తుల కేసులు, అరెస్టులు, 16 నెలలు జైలు జీవితం…ఇలా లక్ష కోట్ల అవినీతి ఆదాయం ఒక్క బైలు తో పక్కన దారి పట్టేసింది.

సరిగ్గా ఇప్పుడు కేటీఆర్ సైతం ఇదే మాదిరి లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారు అంటూ తెలంగాణ సీఎం రేవంత్ నుంచి ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని కల్వకుంట్ల కుటుంబం కూడా గత పదేళ్లలో లక్షల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుందని, మిగులు బడ్జెట్ గా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి కల్వకుంట్ల కుటుంబం మాత్రం లక్షల కోట్ల సంపాదను ఆర్జించిందంటూ సీఎం రేవంత్ పదేపదే ఆరోపిస్తున్నారు, అందుకు తగ్గ ఆస్తుల వివరాలను ప్రజల ముందు ఉంచుతున్నారు.

అయితే లక్ష కోట్ల అవినీతిపై అంటూ తన ప్రత్యర్థుల నుంచి నాడు వైఎస్ జగన్ ఎదుర్కున్న ఆరోపణలను నేడు కేటీఆర్ సైతం తన ప్రత్యర్థి పార్టీల నుంచి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇద్దరు నేతలు కూడా తమ తండ్రులు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పకుడే ఇటువంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావడం యాదృచ్ఛికమే కావచ్చు. కానీ యదార్థంలో ఇదే జరిగింది, జరుగుతుంది.

అయితే అక్కడ జగన్ ఈ ఆరోపణలతో కేసులు పెట్టించుకున్నారు, అరెస్టయ్యారు, జైలుకెళ్లారు, కానీ ఇక్కడ కేటీఆర్ మాత్రం కేవలం ఆరోపణలతో సరిపెట్టుకుంటున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Sundeep Kishan’s Sigma Runtime Locked

Sundeep Kishan's Sigma has generated interest among audiences as it gears up for release on…

22 minutes ago

Star Hotels, Actors Tapping: KTR Responds To Revanth!

There is a class war that is building up in Telangana with chief minister, Revanth…

42 minutes ago