
KTR's Constitution Stand Raises Questions Over KCR's Past Remarks
రాజకీయ నాయకుల మాటలు పరిస్థితులను బట్టి మారుతుంటాయా? లేక కాలంతో పాటు వారి ఆలోచనల్లో మార్పు వస్తుందా? అంటే పరిస్థితులను బట్టి మారుతుంటాయనే అనుకోవాల్సి వస్తోంది.
సర్ ప్రక్రియలో ఓట్ల తొలగింపు, దీనిని నిరసిస్తూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, కాంగ్రెస్, మిత్రపక్షాలు చేస్తున్న ఆందోళనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
“భారత రాజ్యాంగం కంటే గొప్పది ఏదీ లేదు. ఏ పౌరుడి ఓటు హక్కును హరించే అధికారం ఎవరికీ లేదు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలి. వ్యవస్థల కంటే వ్యక్తులు గొప్పవారు కారు” అని అన్నారు.
అయితే, 2022లో అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టి, ప్రస్తుత రాజ్యాంగం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోతోందని, దాన్ని పూర్తిగా తిరగరాయాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కొత్త రాజ్యాంగాన్ని రాయించి దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెస్తామని చెప్పారు.
భారతీయ సమాజం, దేశ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని డా. బీఆర్ అంబేద్కర్ ఎంతో లోతుగా అధ్యయనం చేసి రూపొందించిన రాజ్యాంగాన్ని కేసీఆర్ పనికిరాదంటూ వ్యాఖ్యానించడం అప్పట్లో తీవ్ర రాజకీయ దుమారం రేపింది.
నాడు ఈ రాజ్యాంగమే పనికిరాదని తండ్రి అంటే, నేడు అదే రాజ్యాంగాన్ని గౌరవించి, అందరూ దానికి కట్టుబడి ఉండాలని కుమారుడు చెబుతున్నారు.
కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను, ముఖ్య నేతలను తమ పార్టీలోకి చేర్చుకొని, ఆ పార్టీలను బలహీనపరిచినప్పుడు కేటీఆర్‌తో సహా ఎవరికీ రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్య విలువలు గుర్తుకు రాలేదు. అధికారం కోల్పోయిన తర్వాతే ఇప్పుడు వాటి విలువ తెలిసివస్తోందా?
దీనిని తండ్రీకొడుకుల మధ్య భిన్నాభిప్రాయంగా చూడాలా? లేక అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం కోల్పోయిన తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని భావించాలా?
BOTTOM LINE Artificial Romance, Cheap Laughs PLATFORM ETV Win RUNTIME 3 Hrs | 6 Episodes…
Vijay Deverakonda’s Ranabaali is heading into its North American premiere shows without the advance-booking momentum…