Telugu

లోకేష్‌ పాస్… కవిత కూడా పాస్… మరి కేటీఆర్‌?

కేసీఆర్‌ రెండున్నరేళ్ళుగా ఫామ్‌హౌసులోనే కాలక్షేపం చేస్తూ పార్టీ పగ్గాలు కొడుకు చేతికి అప్పగించారు. హరీష్‌ రావుని కూడా తోడిచ్చారు. కానీ రెండున్నరేళ్ళలో వారిద్దరూ రాష్ట్ర రాజకీయాలపై పట్టు సాధించలేకపోయారు. అందుకే కేసీఆర్‌ గుహలో నుంచి బయటకు రావాల్సివస్తోంది. అందుకే కేసీఆర్‌ రావాలని, తప్పక వస్తారని వారు కూడా చెప్పుకుంటున్నారు!

అదే.. ఏపీలో టీడీపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్‌ ఒకే ఒక్క యువగళం పాదయాత్రతో తనని తాను నిరూపించుకోవడమే కాక పార్టీపై, రాష్ట్ర రాజకీయాలపై పట్టు సాధించారు. ఆ యువగళం ప్రభావం 2024 ఎన్నికలకు కూడా విస్తరించి కూటమికి విజయాన్ని అందించింది.

ADVERTISEMENT

ఆ తర్వాత నారా లోకేష్‌ రాజకీయ ఎదుగుదలని అందరూ చూస్తూనే ఉన్నారు. ప్రధాని మోడీ సైతం నారా లోకేష్‌ ఓ సమర్దుడైన నాయకుడుగా, మంత్రిగా గుర్తించి ప్రశంశిస్తున్నారు.

కానీ ఇదే సమయంలో కేటీఆర్‌ని ఆయన సొంత చెల్లెలు కల్వకుంట్ల కవిత కూడా ‘రాజకీయ పిరికి పంద’ అని తీసి పడేస్తున్నారు. ఆమెకు జవాబు చెప్పలేకపోవడంతో ప్రజలు కూడా కేటీఆర్‌ని పిరికివాడనే భావించకుండా ఉంటారా?

నాడు నారా లోకేష్‌లాగే ఇప్పుడు కల్వకుంట్ల కవిత కూడా అనేక సమస్యలు, సవాళ్ళు ఎదుర్కొంటూ చాలా ధైర్యంగా దూసుకుపోతున్నారు.

ఆమె తన తండ్రి పేరు, ఫోటో పక్కన పెట్టి సొంత గుర్తింపు సంపాదించుకునే ప్రయత్నం చేస్తుంటే, కేటీఆర్‌ మాత్రం తండ్రి పేరుతో రాజకీయాలు చేస్తున్నారు.

కల్వకుంట్ల కవిత ‘నెక్స్ట్ సిఎం నేనే’ అని ఆత్మవిశ్వాసంతో చెపుతుంటే, కేటీఆర్‌ తండ్రి పేరు చెప్పుకుంటూ ఆయన సహాయసహకారంతో మళ్ళీ అధికారంలోకి రావాలని ఆశపడుతున్నారు.

అధికారంలో ఉన్నప్పుడు సమర్దుడు అనిపించుకోవడం తేలికే కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమర్ధత నిరూపించుకున్నవాడే నాయకుడు.

ఇప్పుడు వీరు ముగ్గురినీ బేరీజు వేసుకొని చూస్తే నారా లోకేష్‌, కల్వకుంట్ల కవిత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పూర్తి ఆత్మవిశ్వాసం కలిగి ఉన్నారని, రాజకీయాలలో బలమైన ముద్ర వేస్తున్నారని అర్ధమవుతుంది. కానీ కేటీఆర్‌కి హరీష్‌ రావుని తోడిచ్చి పార్టీని అప్పగించినా ఇంకా తండ్రివైపే చూస్తున్నారు.

రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు, ప్రధాని మోడీని ఎద్దేవా చేయడమే ధైర్య సాహసాలు కావు. అదే నాయకత్వ లక్షణం కాదు.

గులాబీ కారుని సొంతంగా డ్రైవ్ చేయడం నేర్చుకొని పార్టీని, తమని నమ్ముకున్నావారిని గమ్యం చేర్చినప్పుడే నాయకుడవుతారు. లేకుంటే సారొస్తారొస్తారంటూ పాడుకోవాల్సిందే. తప్పదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

తెలంగాణలో మైండ్ గేమ్ పాలటిక్స్.?

తెలంగాణ రాజకీయాలలో రేవంత్ vs కల్వకుంట్ల మధ్య మైండ్ గేమ్ పాలటిక్స్ నడుస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పై బురద జల్లేందుకు…

11 minutes ago

జగన్‌ వార్నింగ్ ఇస్తే చంద్రబాబు దిగొచ్చారటగా?

అవును! నిజమే! జగన్‌ ఒక్క వార్నింగ్ ఇచ్చేసరికి సిఎం చంద్రబాబు నాయుడు హడావుడిగా రాష్ట్రంలో కరువు మండలాలు ప్రకటించేందుకు సిద్దమయ్యారట!…

16 minutes ago