
ఒకప్పుడు మంచి వక్త, వాక్చాతుర్యంతో దిట్ట అనే ట్యాగ్ లైన్లు సంపాధించుకున్న కేటీఆర్ ఇప్పుడు తన బలాన్ని వదులుకుంటున్నారా.? తెలంగాణ భాష మీద యాస మీద తనకున్న పట్టుని పక్కకి మళ్ళిస్తున్నారా.?
ఇప్పుడు కేటీఆర్ పదజాలం, ఆయన తన ప్రత్యర్థి పార్టీల నేతల పై చేస్తున్న రాజకీయ విమర్శలు, అందుకు ఆయన ఎంచుకుంటున్న భాష అన్ని కలిపి ఈ సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి. రోజురోజుకి కేటీఆర్ రాజకీయంగా గాడి తప్పుతున్నారా అన్న అనుమానాలు సామాన్యుడిని సైతం వెంటాడుతున్నాయి.
మరి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కేటీఆర్ పదజాలం అసలు స్వాగతించేలా కనిపించడం లేదు. హౌలే గాడు, నికృష్టుడు, నీచుడు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ గాడు, ఉరి తియ్యాలి,… అంటూ ఇలా నానాటికి కేటీఆర్ భాష పతనమవుతూ వస్తుంది.
కనీసం రేవంత్ స్థాయికి, పదవికి కూడా కనీస మర్యాద లేకుండా కేటీఆర్ చేస్తున్న ఈ విమర్శలు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిని గుర్తుకు తెస్తున్నాయి అనే అభిప్రాయం నానాటికి బలపడుతుంది.
బిఆర్ఎస్ లో కేసీఆర్ తరువాత స్థానంలో ఉన్న కేటీఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎదగాలన్న ఆలోచన లో ఉన్న నేత ఈ తరహా భాషతో ఎవరిని మెప్పించాలని భావిస్తున్నారు.? గతంలో చంద్రబాబు తనయుడు లోకేష్ కి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ఆదర్శం అవ్వాలి అనే లాంటి వ్యాఖ్యలు వినపడేవి.
కానీ ఇప్పుడు కేటీఆర్, లోకేష్ ని చూసి చాలానే నేర్చుకోవాలి అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలు నిండు సభలో తనను, తన తల్లిని ఘోరంగా అవమానించినా, తన తండ్రి కన్నీళ్లకు కారణమైనా,
ఎటువంటి ముందస్తు ఆదేశాలు లేకుండా తన తండ్రిని అరెస్టు చేసి పార్టీని తనను మానసికంగా కుంగదీసినా లోకేష్ ఎన్నడూ వైసీపీ పై కానీ ఆ పార్టీ నేతల పై నోరు జారలేదు. నిబ్బరంగా ఉన్నారు, నిబద్దతతో పోరాడారు. పార్టీ క్యాడెర్ కి నేనున్నాను అనే భరోసా ఇచ్చారు.
రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కొన్నారు, అవమానాలను మోశారు, అవహేళలను తట్టుకున్నారు, వెక్కిరింపులను భరించారు, వ్యక్తిగత దాడులను స్వీకరించారు, కానీ ఏనాడూ భాషను, భావాన్ని అదుపులో పెట్టుకునే ముందుకెళ్లారు. వైసీపీ ఎంతలా రెచ్చిపోయినా, మరెంతలా పప్పు పప్పు అంటూ రెచ్చకొట్టినా ఎక్కడ సహనం కోల్పోలేదు.
అలాంటి లోకేష్ నేడు జగన్ నుంచి సాక్షి విలేకరు వరకు ఎవరికైనా నవ్వుతూనే నోరుమూపిస్తునారు, నాడు ఓటమిలోను నేడు గెలుపులోనూ లోకేష్ అదే తరహా హుందా రాజకీయాలు చేస్తూ, భాషను బోర్డర్ దాటకుండా చూసుకుంటున్నారు. కానీ కేటీఆర్ తన తండ్రి కేసీఆర్ ని తిట్టారని, తనని కించపరిచారని ఇలా తన భాషతో దిగజారిపోతున్నారు.
కేటీఆర్ పదేళ్ల అధికారం చేజారిపోగానే నోటికి అదుపులేకుండా పోయింది. భాష రాజకీయ హద్దులు దాటుకుంటూ ముందుకెళ్తుంది. రాజకీయాలలో ఇటువంటి భాష ఆమోదయోగ్యమేనా అన్న కనీస ఆలోచన లేకుండా వాళ్ళు ఆలా అన్నారు, నేను ఇలా అంటాను అంటూ అద్దులు చెరిపేస్తే రేపటి రోజున ఇందుకు మూల్యం ఇద్దరు చెల్లించాల్సి ఉంటుంది.
అలాగే నాడు కేటీఆర్ భాషను యాసను మెచ్చిన నోర్లె నేడు లోకేష్ భాష తీరును ప్రశంసిస్తున్నాయి. నాడు లోకేష్ కి కేటీఆర్ ఆదర్శంగా నిలిస్తే నేడు లోకేష్ రాజకీయం, ఆయన విధానాలు కేటీఆర్ కి ఆదర్శంగా మారాయి. వాళ్ళు ఒకటంటే నేను వందంతా అంటూ కేటీఆర్ ముందుకెళ్తుంటే,
తల్లి ఆత్మగౌరవాన్ని అవమానించినా, తండ్రిని నిర్బంధించినా, తనను హేళన చేసినా, పార్టీ విధ్వంసాన్ని కాంక్షించినా లోకేష్ ఎన్నడూ సహనం కోల్పోయి జగన్ అండ్ కో మీద పరుష పదజాలం వాడలేదు. వారి కుటుంబంలోని మహిళలను రాజకీయంలోకి లాగలేదు.
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…