వైసీపీ గాలి సోకినా అంతేనా?

చంద్రబాబు నాయుడుని జగన్మోహన్ రెడ్డి ఎంతగా ద్వేషిస్తారో అంతకంటే ఎక్కువగా లక్ష్మీ పార్వతి ద్వేషిస్తుంటారు. ఆమెకు చిన్న అవకాశం లభించినా మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడుని వేలెత్తి చూపుతూ మనసులో అక్కసు అంతా విమర్శలు, ఆరోపణలతో దించేసుకుంటారు.

ఈరోజు హైదరాబాద్‌లో అల్లు అర్జున్‌ని అరెస్ట్‌ చేస్తే, లక్ష్మీ పార్వతి వెంటనే మీడియా ముందుకు వచ్చి, అల్లు అర్జున్‌ అరెస్ట్‌ వెనుక చంద్రబాబు నాయుడి హస్తం ఉందని కనిపెట్టి చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ కేసుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని లక్ష్మీ పార్వతి ఆరోపించారు.

ADVERTISEMENT

అల్లు అర్జున్‌ తన అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు వస్తే తొక్కిసలాట జరిగి మహిళ చనిపోతే పాపం ఆ పిల్లాడికి (అల్లు అర్జున్‌) ఏం సంబంధం?అతనిని అన్యాయంగా అరెస్ట్‌ చేశారు. ఈ కుట్రలో చంద్రబాబు నాయుడి హస్తం ఉందని లక్ష్మీ పార్వతి ఆరోపించారు.

అల్లు అర్జున్‌ విషయంలో ఇంత దూరం ఆలోచించి దీని కంతటికీ చంద్రబాబు నాయుడే కారణమని కనిపెట్టిన లక్ష్మీ పార్వతి, మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న గొడవల గురించి అసలు తెలియనట్లు ఒక్క ముక్క మాట్లాడలేదు. ఒకవేళ మాట్లాడి ఉంటే వాటికీ చంద్రబాబు నాయుడే కారణమని ఆరోపించి ఉండేవారేమో?

మెగా-అల్లు అర్జున్‌ కుటుంబాల మద్య చిచ్చు రగిలించి, పవన్ కళ్యాణ్‌ని రెచ్చగొట్టేందుకు వైసీపీ విఫలయత్నాలు చేస్తూనే ఉంది. అందుకే వైసీపీ అల్లు అర్జున్‌ని అంతగా వెనకేసుకువస్తోంది. పుష్ప-2 విడుదలైనప్పుడు వైసీపీ చేసిన హడావుడే ఇందుకు నిదర్శనం కాగా, ఇప్పుడు ఆ పార్టీకి చెందిన లక్ష్మీ పార్వతి అల్లు అర్జున్‌ని ఈవిదంగా వెనకేసుకువస్తూ మాట్లాడటం మరో నిదర్శనంగా భావించవచ్చు.

అల్లు అర్జున్‌ పట్ల తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు ఆవిదంగా వ్యవహరించి ఉండకూడదని ఆమె చెప్పి ఉంటే ఎవరూ ఈవిదంగా అపార్ధం చేసుకోరు. కానీ అల్లు అర్జున్‌ అరెస్ట్‌ వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడుతో ముడిపెట్టి మాట్లాడటం ద్వారా అల్లు అర్జున్‌ పేరుతో వైసీపీ రాజకీయాలు చేస్తోందని స్పష్టమవుతోంది.

జగన్‌ సహవాసం చేసిన వారిలో చాలా మంది జైలుకి వెళ్ళి వస్తూనే ఉన్నారు. ఆయనను నమ్ముకున్న లక్షల మంది వాలంటీర్లు రోడ్డున పడ్డారు. ఆయన అండచూసుకొని పేట్రేగిపోయిన సోషల్ మీడియా కార్యకర్తలు పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఆయన అండ చూసుకొని బియ్యం అక్రమ రవాణా చేసినవారు, భూ కబ్జాలు చేసినవారు కేసులలో బుక్ అవుతున్నారు. అంటే ‘వైసీపీ గాలి’ తగిలినా చాలా ప్రమాదమన్న మాట! అదే అల్లు అర్జున్‌ అరెస్టుతో మరోసారి నిరూపితమైంది కదా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Epic Faces Brutal OTT Verdict: Outright Rejection?

Anand Deverakonda and Vaishnavi Chaitanya’s Epic is facing brutal trolling after its OTT premiere on…

38 minutes ago

ఆంధ్రాలో ఎవరి ఓట్లు పోలేదా?ఇంత సైలన్స్.. జెన్-జీ ఎక్కాడ?!

దేశంలో లక్షలాది ప్రజల ఓట్లు ‘చోరీ’ అయ్యాయంటూ సీజేపీ, కాంగ్రెస్‌ మిత్రపక్షాల అధ్వర్యంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ రాజీనామాకు పట్టుబడుతూ…

1 hour ago