Telugu

శాసనసభ సమావేశాలు… జగన్‌కు అగ్నిపరీక్షే!

అక్కడ కేసీఆర్‌… ఇక్కడ జగన్‌ ఇద్దరూ మంచి ఆప్తమిత్రులు. ఇద్దరి ధోరణి ఇంచుమించు ఒకేలా ఉంటుంది. ఇద్దరికీ అహంభావం చాలా ఎక్కువే. ఇద్దరూ ఎన్నికలలో ఓడిపోయారు. ఓడిపోయినా ఇద్దరూ తమ ఓటమిని అంగీకరించడం లేదు. ఇద్దరూ అనేక అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఇద్దరూ శాసనసభ సమావేశాలకు హాజరు కాలేని పరిస్థితి నెలకొంది.

ADVERTISEMENT

తెలంగాణ శాసనసభ సమావేశాలకు వెళితే రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు తనని అవమానిస్తారనే భయంతో కేసీఆర్‌ సమావేశాలకు మొహం చాటేస్తున్నారు. కనుక సమావేశాలకు కేసీఆర్‌ ఎందుకు రావడం లేదని వారు ప్రశ్నిన్నారు. ఒకప్పుడు శాసనసభ సమావేశాలలో పులిలా గాండ్రించిన కేసీఆర్‌, ఇప్పుడు శాసనసభ సమావేశలంటేనే ఉలిక్కి పడుతున్నారని కాంగ్రెస్‌ నేతలు ఎద్దేవా చేస్తుంటే, వారికి కేటీఆర్‌, హరీష్ రావులు సమాధానం చెప్పలేకపోతున్నారు.

ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్‌ రెడ్డికి, వైసీపి 10 మంది ఎమ్మెల్యేలకు కూడా సరిగ్గా ఇటువంటి సంకట పరిస్థితి ఎదురవబోతోంది. ఇదివరకు ఇదే శాసనసభలో జగన్‌ సమక్షంలోనే చంద్రబాబు నాయుడుని వైసీపి ఎమ్మెల్యే కొడాలి నాని, రోజా తదితరులు చాలా దారుణంగా అవమానించినందున, ఇప్పుడు వారు కూడా తమని శాసనసభలో ఇంకెంత దారుణంగా అవమానిస్తారో అనే భయం జగన్‌కు ఉండటం సహజమే.

పైగా జగన్‌కు చాలా అహం ఉన్నందున శాసనసభలో అవమానపడటానికి ఇష్టపడరు. కనుక ఏదో వంకతో శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించేసి పాదయాత్రకో, ఓదార్పు యాత్రకో బయలుదేరవచ్చు.

ఈ విషయం టిడిపికి కూడా తెలుసు. అందుకే శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పయ్యావుల కేశవ్, జగన్‌తో సహా 10 మంది వైసీపి ఎమ్మెల్యేలు భేషజాలకు పోకుండా శాసనసభ సమావేశాలకు రావాలని, ప్రజా సమస్యలపై చర్చిద్దామని ఆహ్వానించారు. కానీ జగన్‌ అంత సులువుగా తమ ఉచ్చులో పడరని టిడిపిలో అందరికీ తెలుసు.

ఈ నెల 21, 22 తేదీలలో శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్‌, డెప్యూటీ స్పీకర్‌ ఎన్నిక జరుగుతుంది. కానీ జగన్‌ కూడా కేసీఆర్‌లాగే ఏదో వంకతో ఆ రెండు రోజులు శాసనసభకు రాకుండా తప్పించుకొని సమావేశాలు ముగిసిన తర్వాత స్పీకర్‌ ఛాంబర్‌లో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కనుక వైసీపి ఎమ్మెల్యేలు టిడిపికి చిక్కినా జగన్‌ చిక్కకపోవచ్చు.

టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ప్రోటెం స్పీకరుగా చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం ఆయన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం చేయిస్తారు. వారు స్పీకర్‌, డెప్యూటీ స్పీకర్‌లను ఎన్నుకుంటారు. శాసనసభ స్పీకరుగా టిడిపి సీనియర్ నేత ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడి పేరు ఖరారు అయిన్నట్లు సమాచారం.

ఈ నెల 24వ తేదీన సచివాలయంలో ఉదయం 10 గంటలకు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం జరుగబోతోంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Mrunal Thakur Says No, But What Is She Waiting For?

Mrunal Thakur has not signed a new film in nearly nine months. However, it is…

26 minutes ago

Rohit Back as MI Cap? Truth Behind Big Rumours

Mumbai Indians have reportedly shut down rumours of Rohit Sharma returning as captain for IPL…

56 minutes ago