ఒక సినిమా హిట్టు, ఫ్లాప్ అనేది ఎవరూ ముందు ఊహించలేరు కానీ.. సినిమా హిట్టయితే క్రెడిట్ మొత్తం హీరోల ఖాతాలో చేరితే… ఫ్లాప్ తాలూకు బాధ్యత మాత్రం దర్శకుల నెత్తి మీద పడుతుంది. అయితే.. ఆ ఫ్లాప్ అనేది హీరో ఇమేజ్ ని ఎంతో కొంత డ్యామేజ్ చేయడం అనేది ఖాయం.
కాకపోతే.. ఈవారం విడుదలైన “LIK” సినిమా రిజల్ట్ ఎఫెక్ట్ మాత్రం హీరో ప్రదీప్ రంగనాథ్ మీద ఏమాత్రం పడకపోవడం విశేషం. నిజానికి “LIK” అనేది ప్రదీప్ రెండో సినిమాగా విడుదలవ్వాలి. కారణాంతరాల వల్ల డిలే అవుతూ వచ్చి.. ఎట్టకేలకు ఏప్రిల్ 10న రిలీజైంది.
అందరూ ముందే ఊహించినట్లుగా “LIK” కనీస స్థాయిలో కూడా ఎవర్నీ అలరించలేకపోయింది. సినిమా మొత్తానికి ఉన్న ఏకైక పాజిటివ్ పాయింట్ ప్రొడక్షన్ & ఆర్ట్ టీమ్ ఎఫర్ట్ మాత్రమే. నయనతార డబ్బులన్నీ తగలేసాడని తమిళ మీడియా తిట్టిపోసింది.
నిజానికి ప్రదీప్ రంగనాధ్ మునుపటి మూడు సినిమాలు 100 కోట్ల వసూళ్లు సాధించడమే కాక.. హ్యాట్రిక్ హిట్ గా నిలిచాయి. అలాంటి హీరో నుండి 4వ సినిమా వస్తుంది అంటే ఏస్థాయి హైప్ ఉండాలి. కానీ.. జీరో హైప్ తో సినిమా రిలీజ్ అవ్వడానికి ముఖ్యకారకుడు దర్శకుడు విఘ్నేష్ శివన్. అందువల్ల.. సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చినా ఒక్కరు కూడా ప్రదీప్ ని తిట్టడంలేదు.
ఈమధ్యకాలంలో సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినా.. హీరోకి ఎఫెక్ట్ పడకపోవడం, హీరోని ఎవరూ తిట్టకపోవడం అనేది కేవలం ప్రదీప్ రంగనాథ్ విషయంలో మాత్రమే సాధ్యపడింది.




