లాక్ డౌన్ కారణంగా మొత్తం పరిశ్రమలో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. షూటింగ్‌లు ఆగిపోయి సినిమా విడుదలలు నిలిచిపోయాయి. ఈ పరిస్థితులు ఎప్పుడు సాధారణమవుతాయనే దానిపై ఎవరికీ ఐడియా లేదు. తారలు ఈ విరామాన్ని స్వాగతిస్తుంటే… పరిశ్రమ మీద ఆధారపడే రోజువారీ కూలీలు, సినీ కార్మికులు చాలా మంది పస్తులుండాల్సిన పరిస్థితి.
అయితే లాక్ డౌన్ వాళ్ళ మ్యూజిక్ డైరెక్టర్లకు మాత్రం నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందట. దాదాపు అందరు సంగీత దర్శకులకు వారి సొంత రికార్డింగ్ స్టూడియోలు ఉన్నాయి. కాబట్టి, దర్శకులు తమ ఇంటి వద్దకు చేరుకుంటున్నారు. ఇప్పటికే కంపోజ్ చేసిన పాటలు మరింత బెటర్ చెయ్యాలి అంటూ… కంపోజ్ చెయ్యాల్సిన ట్యూన్లు అద్భుతంగా రావాలి అంటూ నాన్ – స్టాప్ మ్యూజిక్ సిట్టింగులు పెడుతున్నారట.
ఇక ఒకేసారి ఎక్కువ స్టార్ చిత్రాల కోసం పనిచేసే సంగీత దర్శకులకు ఇది ఒక పీడకలగా మారింది. స్టార్స్ మరియు స్టార్ దర్శకులను బాధపెట్టకూడదని వారు నో చెప్పలేరు. కొందరు మ్యూజిక్ డైరెక్టర్లు హైదరాబాద్ లో లేకుండా చెన్నై వెళ్లిపోతున్నారట. తొందరలో షూటింగ్‌లు ప్రారంభం అవ్వాలని దర్శకులు బిజీగా ఉండాలని వారు ప్రార్థిస్తున్నారు.
సమీప భవిష్యత్తులో అది జరుగుతుందో లేదో చూడాలి. మరోవైపు కొందరు సంగీత దర్శకులు అన్ ఆఫీసియల్ గా రికార్డింగ్లు మొదలు పెట్టారంట. జాగ్రత్తలు తీసుకుంటే పాటల రికార్డింగ్ మొదలు పెట్టారని సమాచారం. కాకపోతే ముంబై నుండి వచ్చే గాయకుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయంట. వారు హైదరాబాద్ లేక చెన్నై రావడానికి ఇబ్బంది గా మారిందట.





