Telugu

మామ మాటలు కాదు మంత్రి చేతలు..!

జగన్ మాదిరి మామగా మాటలు చెప్పడం కాదు మంత్రిగా బాధ్యతలు నెరవేరుస్తూ చేతలతో తన సంకల్పాన్ని చెపుతున్నారు విద్యా శాఖ మంత్రి లోకేష్. నాడు జగన్ మావయ్య అంటూ పిలిపించుకున్న నోర్లు నేడు మా మంత్రి లోకేష్ అంటూ కీర్తిస్తున్నాయి.

ఐటీ, విద్యా శాఖ మంత్రిగా నారా లోకేష్ పాలనలో, ప్రభుత్వంలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. అటు సోషల్ మీడియా పోస్ట్ నుంచి ఇటు వాట్స్ అప్ చాట్ వరకు విద్యార్థులకు ఏ సమస్య ఉందని తన దృష్టికొచ్చినా ఆ సమస్య పరిష్కారానికి పెద్ద పీట వేస్తున్నారు.

ADVERTISEMENT

అలాగే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి విద్యార్థినులకు అందించే వస్తువుల మీద కూడా రాజకీయ నాయకుల ఫోటోలకు తొలగిస్తూ విద్యకు రాజకీయాన్ని దూరం చేసారు. ఇక ప్రభుత్వ పాఠశాలలో అందించే ఆహారానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టి గత చరిత్రను భవిష్యత్ తరానికి అందిస్తున్నారు.

ఇక పాఠశాలలో శనివారం నో బాగ్ డే అంటూ ప్రకటించి విద్యార్థుల చదువు ఒత్తిళ్లకు నైపుణ్యంతో పదును పెట్టారు. అలాగే ఇంటి పనులు అంటే మహిళలే అన్నట్టుగా ఎంతోకాలంగా పాఠ్య పుస్తకాలలో ఉంటూ వస్తున్న ఫోటోలను మార్చాలంటూ ఆదేశించారు, అలాగే అందుకు తగ్గట్టు పాఠ్యపుస్తకాలలో లింగ వివక్షతకు తావులేకుండా మార్పులకు శ్రీకారం చుట్టారు.

ఇక విద్యా – విలువలు సలహాదారునిగా నియమించిన ప్రముఖ ప్రవచన కర్త, గొప్ప ఆధ్యాత్మిక వేత్త శ్రీ చాగంటి కోటేశ్వరరావు చేత విద్యార్థులతో విజయవాడలో నిర్వహించిన కార్యక్రమం కూడా విద్యా శాఖ మంత్రిగా లోకేష్ ను ఒక మెట్టెక్కించింది.

అలాగే నేడు దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేష్ విద్యార్థి – విద్యార్థినులతో ఒక మాక్ అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసి ఆ సమావేశాలను దాదాపు 45 వేల స్కూల్స్ లో ప్రత్యక్ష ప్రసారం చేసేలా చర్యలు తీసుకున్నారు.

అయితే ఈ కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ తో పాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా హాజరయ్యారు. ఏపీలోని 175 నియోజకవర్గాలను రిప్రజెంట్ చేస్తూ అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీలుగా విడిపోయి రెండు బిల్లుల పై చర్చిందేందు ముందుకొచ్చారు.

అందులో ఒకటి సోషల్ మీడియా పై నియంత్రణ కాగా రెండవది పర్యావరణ సంరక్షణ. ఇందులో రెండు అంశాలు విద్యార్థులకు అత్యంత కీలమైనవే కావడం విశేషం. సోషల్ మీడియా వాడకం ఎంతవరకు పరిమితం చెయ్యాలి అనేది ఇప్పటి నుంచే విద్యార్థులకు తెలియడం అవసరం.

అలాగే పర్యావరణాన్ని పరిరక్షించడం ఎంత కీలకమో, అది లేకుంటే ఎంత విధ్వంశమో విద్యార్థులకు తెలిసి రావడం చాల ముఖ్యం. నేటి బాలలే రేపటి పౌరులు అనేదానికి మంత్రిగా లోకేష్ తీసుకుంటున్న ఈ చర్యలు నిజంగా హర్షణీయనే చెప్పాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Indian 3 Back! Can Kamal & Shankar Pull Off a Miracle?

Lyca Productions has finally dropped an update regarding Kamal Haasan's Indian 3, stating that Senapathy…

5 minutes ago

Fake Account On PK, Targeted Lokesh, But Got Arrested

The NDA leadership in Andhra Pradesh has repeatedly raised concerns about alleged attempts to create…

25 minutes ago