
ముర్కత్వం సొంతవాడిని కూడా పరాయివాడిగా మారుస్తుంది అనేది ఎంత వాస్తవమో అలాగే మంచితనం పరాయివాడిని కూడా సొంతవాడిగా చేయగలదు అనేది కూడా అంతే యదార్ధం. ఇందుకు తాజాగా జరిగిన ఒక సంఘటన ప్రత్యక్ష ఉదాహరణ.
మంత్రి నారా లోకేష్ దృష్టికి వచ్చిన ఒక వీడియో పై ఆయన స్పందిన తీరు వైసీపీ మద్దతుదారులను సైతం మెప్పించింది. జగన్ ను కించపరిచేలా టీడీపీ మద్దతుదారులు రూపొందిన ఈ వీడియో పై లోకేష్ తన పార్టీ క్యాడర్ ను ప్రేమగా మందలించారు.
ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు కీర్తింపబడవు అంటూ వారి చర్యలను ఖండించారు, అలాగే ఇక పై ఇటువంటి పనులు ఎవరు చేయొద్దు అంటూ వారికి హితవు పలికారు. అయితే గతంలో ఇదే వైసీపీ బాబు, లోకేష్, పవన్ ల పై వారి కుటుంబ సభ్యుల పై సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన పోస్టులతో రెచ్చిపోతూ వికృత రాజకీయ క్రీడ ఆడింది.
అయితే నాడు అందుకు జగన్ నుంచి వారికి పూర్తి మద్దతు లభించింది. కానీ నేడు లోకేష్ ఇటువంటి వాటికి తానూ వ్యతిరేకం అంటూ కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు ఈ చర్యలే మూర్కత్వనికి – మంచితనానికి మధ్య ఉన్న అంతరాన్ని ప్రత్యర్థి వైసీపీ పార్టీ మద్దతుదారులకు తెలిసొచ్చేలా చేస్తున్నాయి. వారిని సైతం టీడీపీ పట్ల ఆకర్షితులను చేసేలా పరిస్థితులను మారుస్తున్నాయి.
ఇక నాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో నాటి ప్రతిపక్ష నేత సతీమణి నారా భువనేశ్వరి ఆత్మ గౌరవం పై అసెంబ్లీ సాక్షిగా వైసీపీ దాడి చేసి పైశాచిక ఆనందాన్ని అనుభవించింది. అలాగే పార్టీ అధినేతగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాడు వైస్ జగన్ ఆ పైశాచికత్వాన్ని కట్టడి చేయకపోగా తన చర్యలతో మరింతగా ప్రోత్సహించారు.
ఇక నేడు ఒక టీడీపీ కార్యకర్త జగన్ సతీమణి భారతి రెడ్డి పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపించారు, అలాగే టీడీపీ పార్టీ నుండి బయటకు తరలించారు. ఈ నేపథ్యంలో ఇటు టీడీపీ అధినేతగా, అటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాబు తీసుకున్న చర్యలకు వైసీపీ సానుభూతిపరులు సైతం ప్రశంసలు కురిపించారు.
ఇక మాజీ మంత్రి పేర్ని నాని అంశానికొస్తే, తన భార్య పేర్ని జయసుధ పేరుమీద ఉన్న రేషన్ గోదాములో పెద్ద మొత్తంలో అక్రమ రేషన్ పట్టుబడింది. దీనికి గాను ఆ గోదాము యజమాని పేర్ని జయసుధను అరెస్టు చెయ్యాల్సి ఉండగా ముఖ్యమంత్రి బాబు రాజకీయాలకు సంబంధం లేని మహిళలను కేసులలో ఇరికించి అరెస్టులు చేయడం సబబు కాదన్నారంటూ సాక్ష్యాత్తు పేర్ని నాని నే బహిరంగా మీడియాలో బాబు రాజకీయాన్ని పొగడ్తలతో ముంచెత్తారు.
ఈ విషయంలో కూడా చాలామంది వైసీపీ మద్దతుదారులు టీడీపీ రాజకీయ విధానాలకు ఫిదా అయ్యారు. అలాగే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మూడు రాజధానుల పేరుతో బాబు ప్రకటించిన అమరావతిని సమాధి చేసిన జగన్ విశాఖలో కూడా అభివృద్ధికి పునాదులు వెయ్యలేదు.
కానీ నేడు టీడీపీ కూటమి ఇటు రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూనే అటు జగన్ ప్రతిపాదించిన విశాఖను ఐటీ హబ్ గా అభివృద్ధి చేస్తుంది. బాబు తీసుకున్న ఈ నిర్ణయం కూడా విశాఖ వైసీపీ క్యాడర్ లో టీడీపీ పట్ల సానుకూలతను తీసుకువచ్చిందనే చెప్పాలి.
ఇలా ఒక పక్క టీడీపీ తన రాజకీయ విధానాలతో, బాబు, లోకేష్ తమ రాజకీయ విలువలతో వైసీపీ తోటలో కూడా జగన్ కు నచ్చని పసుపు పంట పండించుకోగలుగుతున్నారు. మరి జగన్ తన అనుమతి లేకుండా తన తోటలో పెరుగుతున్న ఈ పసుపు పంటను కాపు దాకా పెంచి పోషిస్తారా.? లేక తన రాజకీయ మూర్కత్వన్ని వీడి పసుపుని కోత కోస్తారా.?
The NDA leadership in Andhra Pradesh has repeatedly raised concerns about alleged attempts to create…
Ram Charan fans have plenty of reasons to be frustrated with Peddi. The film had…