ప్రిన్స్ మహేష్ బాబు “బ్రహ్మోత్సవం” సినిమాలో ముద్దుల కూతురు సితార ఒక పాత్ర పోషించిందని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై చిత్ర యూనిట్ ఇప్పటివరకు ఓ స్పష్టత ఇవ్వకపోవడంతో, బహుశా ఏ చిన్న పాత్రలో అయినా కనపడి ఉంటుందని ప్రిన్స్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రిన్స్ మహేష్ బాబు స్పష్టత ఇచ్చారు.
‘బ్రహ్మోత్సవం’ సితార ఉందన్న విషయం కేవలం ఒక పుకారు మాత్రమేనని, అయితే ఆడియో వేడుకకు మాత్రం విచ్చేసిందని, మొదటిసారి తను నటించిన ఆడియో వేడుకకు సితార రావడం అనేది… ఎక్కడో అందరికీ మంచి జరుగుతుందన్న ఫీలింగ్ వచ్చిందని, పిల్లలు వస్తే అంతా మంచి జరుగుతుందంటారు కదా… అదే ఆడియో వేడుకపై తాను చెప్పానని, అంతకు ముందు మొదటిసారిగా గౌతమ్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా ఆడియో వేడుకకు విచ్చేసాడని… ఇద్దరూ శ్రీకాంత్ గారి సినిమాల ద్వారానే ప్రేక్షకులకు పరిచయం అయ్యారని చెప్పుకొచ్చారు ప్రిన్స్.



