
‘మెగా’ సినిమాల నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ జనవరిలో ప్రారంభం కాబోతుందని నిర్మాణ సంస్థ నుండి వెలువడిన సమాచారం మహేష్ అభిమానుల్లో మరింత టెన్షన్ పెంచుతోంది. దీనికి కారణం ప్రిన్స్ తో కొరటాల శివ రెండవ సారి జత కట్టడమే! ఇటీవలే ‘బ్రహ్మోత్సవం’ వంటి చేదు అనుభవాన్ని శ్రీకాంత్ అడ్డాల చవిచూపించిన నేపధ్యంలో… రెండవసారి ప్రిన్స్ తో జతకట్టడమంటే అతి పెద్ద రిస్క్ తీసుకున్నట్లుగానే అభిమానులు భావిస్తున్నారు.
ఒక్క పూరీ జగన్నాధ్ తప్ప హేమాహేమీ దర్శకులైన త్రివిక్రమ్, గుణశేఖర్, శ్రీనువైట్ల లు కూడా ప్రిన్స్ తో పరాజయాలు అందుకోవాల్సి వచ్చింది. దీంతో మళ్ళీ కొరటాల శివ అనే పాటికి ముందుగా ‘శ్రీమంతుడు’ సంతోషం గుర్తుకు వస్తున్నా… తర్వాత ఏమవుతుందో అన్న భయం ఎక్కువగా వ్యక్తమవుతోంది. అయితే ఈ ప్రకటనతో కొరటాల నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కూడా స్పష్టత వచ్చినట్లే చెప్పవచ్చు. చెర్రీ, అఖిల్ అంటూ హల్చల్ చేసిన పుకార్లకు స్వస్తి పలుకుతూ… ‘జనతా గ్యారేజ్’ తర్వాత కొరటాల ప్రాజెక్ట్ ప్రిన్స్ దే కావడం విశేషం.
Director Sandeep Reddy Vanga had been tasting phenomenal success right from the early stages of…
Small films are releasing in large numbers in Tollywood, but very few are making a…