అందరూ అన్ని యాంగిల్స్ లో అందంగా ఉండరు. అలాగే ఏ యాంగిల్ పెట్టినా అద్భుతంగా ఉండేవారు మరికొందరు. ఈ రెండవ జాబితాలోకే వస్తారు మన టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు. సిల్వర్ స్క్రీన్ పైనే కాదు, ప్రైవేటుగా హల్చల్ చేసే ఫోటోలలోనూ ప్రిన్స్ లుక్స్ వీక్షకులను మెప్పిస్తాయి. తాజాగా ఆ కోవలోనే లండన్ లో ప్రిన్స్ దిగిన ఓ స్టిల్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
మంచు కొండల నడుమ ఓ గొడుగు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్న ప్రిన్స్ మహేష్ బాబు ఫోటో చూడముచ్చటగా ఉండడంతో ప్రిన్స్ అభిమానులు ఈ ఫోటోతో సందడి చేస్తున్నారు. లండన్ వెళ్ళిన నాటి నుండి ప్రిన్స్ ఫోటో ఇదొక్కటే బయటకు రావడంతో ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ముఖం కనిపించకుండా ప్రిన్స్ వెనుక వైపు నుండి తీసినా ఫోటో అయినా గానీ, సూపర్ స్టార్ కటౌట్ కు వీక్షకులు ఫిదా అయ్యే విధంగానే ఉండడమే ఈ హల్చల్ కు కారణం.
ADVERTISEMENT
ADVERTISEMENT



