‘బ్రహ్మోత్సవం’ టికెట్స్ – హాట్ కేక్స్!

Mahesh babu brahmostavam advance bookingశ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు సరసన సమంత, కాజల్, ప్రణీతలు నటించిన “బ్రహ్మోత్సవం” సిల్వర్ స్క్రీన్ పై దర్శనమివ్వడానికి సమయం దగ్గర పడుతోంది. దీంతో ఈ సినిమా టికెట్ల కోసం ప్రయాస పడడం ప్రిన్స్ అభిమానుల వంతవుతోంది. అయితే, ‘బ్రహ్మోత్సవం’ చిత్ర యూనిట్ ఇచ్చిన ప్రమోషన్స్ కారణంగా సాధారణ ప్రేక్షకుల్లోనూ ఈ సినిమా పట్ల ఆసక్తి నెలకొంది. దీంతో ‘బ్రహ్మోత్సవం’ టికెట్ల పరిస్థితి ‘హాట్ కేక్స్’లా మారిపోయింది.

సాధారణంగా మాస్ సినిమాలకు ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. కానీ, పక్కా క్లాస్ మూవీగా రూపుదిద్దుకున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు ఈ రేంజ్ లో ఆకర్షితులు కావడం అనేది, ప్రేక్షకులకు ట్రైలర్ చేరువ కావడం, ఆడియో సక్సెస్ అవ్వడం మరియు ప్రమోషన్ కార్యక్రమాల వల్లనే అని చెప్పాలి. ఏపీ, తెలంగాణాలలో మల్టీప్లెక్స్ ల ఆన్ లైన్ బుకింగ్స్ జోరుగా సాగుతుండగా, మొదటి రోజు టికెట్లు ఓపెన్ చేసిన కొద్ది నిముషాలకే ‘రెడ్ సిగ్నల్’ వేయడం ప్రేక్షకులకు నిరుత్సాహం కలిగించే అంశం.

ADVERTISEMENT

రెండు తెలుగు రాష్ట్రాల మల్టీప్లెక్స్ ల పరిస్థితి ఇలా ఉంటే, మహేష్ కు భారీ ఫాలోయింగ్ ఉన్నటువంటి బెంగుళూరు వంటి నగరాలలో అడ్వాన్స్ బుకింగ్స్ లో సరికొత్త రికార్డులు సృష్టించే విధంగా దూసుకెళ్తోంది. ఇక, మహేష్ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే ఓవర్సీస్ మార్కెట్ లో కూడా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఒక్క ప్రీమియర్ షోలకే 1 మిలియన్ మార్క్ టచ్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు. చిత్ర యూనిట్ ఆశించిన విధంగా ‘సూపర్ హిట్’ టాక్ వస్తే, ఓవర్సీస్ లో ఆకాశమే హద్దుగా ప్రిన్స్ చెలరేగిపోతాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ సినిమాకు వచ్చే “టాక్” ఎలా ఉన్నా… గొప్ప మానవతా విలువలు కలిగిన సన్నివేశాలు, మరిన్ని ఆలోచింపచేసే డైలాగ్స్ తో కూడిన అతికొద్ది సినిమాలలో “బ్రహ్మోత్సవం” ఒకటిగా నిలిచిపోతుందని చెప్పకతప్పదు. ఈ సందర్భంగా ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో ప్రిన్స్ చెప్పిన ఓ డైలాగ్… “మనుషుల్లో మంచోళ్ళు, కొంచెం మంచోళ్ళు, కొంచెం చెడ్డోళ్ళు మాత్రమే ఉంటారు” అని ఓ ఇంటర్వ్యూలో మహేష్ చెప్పగా, దానిని సవరిస్తూ… శ్రీకాంత్ “మనుషుల్లో మంచోళ్ళు, కొంచెం మంచోళ్ళు మాత్రమే” అని చెప్పిన డైలాగ్ నిజంగానే… మనుషులైన ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసేలా చేస్తోంది. బహుశా అందుకేనేమో… తన కెరీర్ లో ఎప్పుడూ చూడనంత ఆసక్తిగా ఈ సినిమా విడుదల కోసం వేచిచూస్తున్నానని మహేష్ బాబు చెప్పారు.

ADVERTISEMENT
Latest Stories