మరీ అంత గుడ్డితనం పనికిరాదేమో… మహేష్!

Mahesh babu dance step in brahmostavamఒక్కసారి దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత… డైరెక్టర్ చెప్పింది గుడ్డిగా ఫాలో అయిపోతారనే నానుడి మహేష్ గురించి ఇండస్ట్రీ వర్గాలు చెప్తూ ఉంటారు. చాలా సందర్భాలలో ఈ విషయాన్ని మహేష్ బాబే స్వయంగా చెప్పారు కూడా! అయితే ఎంతగా నమ్మినా మరి కొన్ని సన్నివేశాలకు ప్రిన్స్ ఎలా గ్రీన్ సిగ్నల్ ఇస్తారో అభిమానులకే అర్ధం కాని విషయంగా మారింది.

ముఖ్యంగా ‘బ్రహ్మోత్సవం’ సినిమాలోని ‘బాలత్రిపురమణి’ పాటలో ‘హలేహలలే…’ అంటూ వచ్చిన సమయంలో ప్రిన్స్ వేసిన స్టెప్… సోషల్ మీడియాకు మాంచి ఆహారంగా మారింది. ఈ పాటను ఎవరు కొరియోగ్రఫీ చేసారో గానీ, వారికి ప్రిన్స్ ఫ్యాన్స్ అంతా దండలు పెడుతున్నారు. అయితే కనీసం మానిటర్ లో చూసుకున్నప్పుడు మహేష్ కైనా ఈ ‘స్టెప్’ల గురించి అర్ధం కాకుండా ఉంటుందా? ఒకవేళ ఆ సమయంలో ఏదో వేసేసారని అనుకున్నా, ఎడిటింగ్ లో అయినా దానికి కత్తెర వేసుకునే సౌలభ్యం ఉంటుంది కదా..! అంటూ తమ వ్యధను వెళ్ళగక్కుతున్నారు

ADVERTISEMENT

ఇప్పటివరకు డ్యాన్స్ ల విషయంలో పవన్ కళ్యాణ్ పైన ఎక్కువ సెటైర్లు పడ్డాయి. ఇటీవల విడుదలైన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమాలో కూడా చిరు వేసిన ‘ఇంద్ర’ స్టెప్ ను పవన్ వేయడాన్ని మెగా అభిమానులే జీర్ణించు కోలేకపోయారు. అప్పుడు కూడా సోషల్ మీడియాకు పవన్ ‘ఫుల్ మీల్స్’ పెట్టారు. తాజాగా మహేష్ వంతు వచ్చింది. పాటంతా సరిగానే ఉన్నా… ఆ ఒక్క స్టెప్ సినిమాకే హైలైట్ అయ్యేలా తీర్చిదిద్దిన ఆ ప్రఖ్యాత కొరియోగ్రఫర్ రాజు సుందరం అని సమాచారం. అంతకు ముందు రాజు సుందరం అనేక సూపర్ హిట్ పాటలు ఇవ్వడంతో ఆ ‘గుడ్డి’ నమ్మకంతోనే ప్రిన్స్ ‘సై’ అని ఉంటారు… అని ఇండస్ట్రీ టాక్.

ADVERTISEMENT
Latest Stories