
మరి అంతటి ప్రాధాన్యత కలిగిన పాత్రలో ఎవరు నటిస్తున్నారు? అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం కాగా… తాజాగా దానికి సమాధానం లభించింది. ప్రముఖ తమిళ నటుడు “ప్రేమిస్తే” హీరో భరత్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించబోతున్నట్లుగా సమాచారం. ఈ పాత్ర గురించి చిత్ర యూనిట్ వర్గాలు సస్పెన్స్ మైంటైన్ చేస్తుండడంతో సినీ జనాల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు విడుదలైన స్టిల్స్ లో గానీ, లీకైన షూటింగ్ వీడియో ఫుటేజ్ లో గానీ ఎక్కడా భరత్ కనిపించకపోవడం, ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.
ప్రిన్స్ మహేష్ బాబు నటించే తదుపరి సినిమా టైటిల్ “భరత్ అనే నేను” కావడం… ప్రస్తుత చిత్రంలో “భరత్” కీలక పాత్ర పోషిస్తుండడం కాకతాళీయమే గానీ… భరత్ కు మాత్రం ఓ అవకాశం లభించినట్లయ్యింది. “భరత్ అనే నేను” ఈ సినిమాలో ఉన్నానని చెప్పుకునే అరుదైన అవకాశం దక్కింది. ఇక, ఈ సినిమా టైటిల్ విషయంలో ఇటీవల రిజిస్టర్ చేసిన “సంభవామి” పైన కూడా చిత్ర యూనిట్ వర్గాలు సంతృప్తిగా లేరని, మరే ఇతర టైటిల్ దొరకని పక్షంలో ఈ “సంభవామి”ని ఖరారు చేస్తారని ట్రేడ్ టాక్.
The upcoming reunion project of Kamal Haasan and Rajinikanth, tentatively titled KH×RK, continues to generate…
The tension between the Telangana Exhibitors Association and top producers has officially turned into an…