హీరోయిన్లు గురించి చెప్పేటప్పుడు మహేష్ ఎప్పుడూ ఒకే తీరుగా మాట్లాడతారని ‘బిజినెస్ మెన్’ ఆడియో వేడుకపై దర్శకుడు పూరీ జగన్నాధ్ ఒక వీడియో రూపొందించి ప్రదర్శించాడు. దాంతో మహేష్ తో సహా ఆడిటోరియంలో నవ్వులు పూలు వెల్లివిరిశాయి. దీంతో హీరోయిన్ల గురించి మాట్లాడడంలో మహేష్ కాస్త వీక్ అన్న విషయం హైలైట్ అయ్యింది.
తాజాగా ‘బ్రహ్మోత్సవం’ ఆడియో వేడుకపై కూడా ప్రిన్స్ వీక్ నెస్ మరోసారి బయటపడింది. చిత్ర తారాగణం అందరి పేర్లు చెప్పుకుంటూ వస్తున్న మహేష్, ఆ క్రమంలోనే హీరోయిన్లు కాజల్, సమంతల గురించి మాట్లాడారు. వారిద్దరితో ఇంతకుముందు నటించానని, వాళ్ళు ప్రొఫెషనల్ అని యధావిధిగా తన మార్క్ డైలాగ్స్ తో ప్రసంగించిన ప్రిన్స్, మరో హీరోయిన్ ప్రణీత పేరు పలకపోవడం విశేషం.
నిజానికి మహేష్ మాట్లాడుతున్న సమయంలో బ్యాక్ గ్రౌండ్ స్క్రీన్లో ప్రణీతనే ఫోకస్ అయ్యింది. మహేష్ తన పేరు చెప్తారని ఆశించిన ప్రణీత ఒకింత నిరుత్సాహపడడం పెద్ద స్క్రీన్ పై స్పష్టంగా కనపడింది. బహుశా ప్రణీతతో ప్రిన్స్ చేసిన సన్నివేశాలు కావడం వల్లనే మరిచిపోయారేమోనని ‘బ్రహ్మోత్సవం’ వేడుక జరిగిన ఆడిటోరియంలో వినిపించిన మాటలు. మరో విశేషమేమిటంటే… విడుదల చేసిన ధియేటిరికల్ ట్రైలర్లో కూడా ప్రణీత సన్నివేశాలు లేకపోవడం. దీంతో… ప్చ్… అంటూ మనసులోనైనా నిట్టూర్పును ప్రదర్శించుకోకుండా ఉంటుందంటారా..!





