Telugu

‘బిగ్ బాస్’ షోలో మహేష్ బాబు!

“స్పైడర్” ద్వారా తమిళనాట ప్రిన్స్ మహేష్ బాబు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 9వ తేదీన ఓ భారీ ఈవెంట్ ను పెట్టి మరీ, ‘సూపర్ స్టార్’ రజనీకాంత్ చేతుల మీదుగా తమిళనాడుకు ప్రిన్స్ ను పరిచయం చేయాలని ఇప్పటికే దర్శకుడు మురుగదాస్ పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, మహేష్ కోసం సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు ‘లోకనాయకుడు’ కమల్ హాసన్ ను కూడా ‘స్పైడర్’ కోసం వాడేయబోతున్నారని తెలుస్తోంది.

ADVERTISEMENT

తమిళంలో కమల్ నిర్వహిస్తున్న ‘బిగ్ బాస్’ షోలో ‘స్పైడర్’ పబ్లిసిటీ కార్యక్రమాలు ప్లాన్ చేసినట్లుగా లభించిన కీలక సమాచారం. ఈ షోకు టీఆర్పీ బాగుండడంతో, ఈ షోలో ‘స్పైడర్’ సినిమాతో పాటు, ప్రిన్స్ మహేష్ బాబు ప్రమోట్ చేయడానికి దర్శకుడు మురుగదాస్ సన్నాహాలు చేస్తున్నారట. అంటే ఏదొక రూపేణా తమిళ ‘బిగ్ బాస్’ కార్యక్రమంలో ప్రిన్స్ మహేష్ బాబు సందడి చేయబోతున్నారన్న మాట. మొత్తానికి మహేష్ కోసం మురుగదాస్ భారీ స్కెచ్ లే సిద్ధం చేస్తున్నట్లుగా కనపడుతోంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Beyond Star Power: Tollywood’s New Box Office Game

Telugu cinema has always been heavily dependent on star power. Big heroes bring big openings,…

5 minutes ago

Devudichhina Annayya: Lokesh’s Hearty Wish To PK!

Pawan Kalyan was one of the individuals to firmly stand by the Chandrababu Naidu family…

40 minutes ago