‘మహేష్’ చేతుల మీదుగా ‘మెగా’ సినిమా ట్రైలర్ విడుదల!

mahesh babu launches oka manasu theatrical trailerమెగా వారసురాలు నిహారిక తొలి సినిమా “ఒక మనసు” ధియేటిరికల్ ట్రైలర్ ను ప్రిన్స్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేసారు. ‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’ దర్శకుడు రామరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగశౌర్య, నిహారిక జంటగా నటిస్తున్నారు. మంచి ఫీల్ గుడ్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, జూన్ లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

ADVERTISEMENT

ఇందులో భాగంగా ఆడియో విడుదల కంటే ముందే, సినిమా ట్రైలర్ ను విడుదల చేసి ప్రమోషన్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అది కూడా త్వరలో ‘బ్రహ్మోత్సవం’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రిన్స్ ద్వారా విడుదల చేయడం మరింత ప్రచారాన్ని తెచ్చుకుంటోంది. అంతమంది మెగా హీరోలు ఉన్నప్పటికీ, నిహారిక తొలి ట్రైలర్ ను ప్రిన్స్ విడుదల చేయడం నిహారిక సంథింగ్ స్పెషల్ అని చెప్పకనే చెప్తోందన్న మాట.

ప్రిన్స్ విడుదల చేసిన ఈ ట్రైలర్ మరికొద్ది గంటల్లో యూ ట్యూబ్ లోకి ప్రత్యక్షం కానుంది. అయితే చిత్ర యూనిట్ వర్గాల ద్వారా ఈ ట్రైలర్ కు సంబంధించిన కొన్ని నిహారిక స్క్రీన్ షాట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. షార్ట్ ఫిలిమ్స్, యాంకరింగ్ ద్వారా ఇప్పటికే విశేష ఆదరణ చూరగొన్న ఈ మెగా వారసురాలి స్క్రీన్ ప్రజెన్స్ ఏ రేంజ్ లో ఉందో తెలుసుకోవాలంటే మరికొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే.

ADVERTISEMENT
Latest Stories