ప్రిన్స్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంది. అలాగే “మహర్షి” టైటిల్ తో ఇచ్చిన ట్విస్ట్ కూడా ప్రిన్స్ ఫ్యాన్స్ ను మెప్పించింది. ఇక “మహర్షి”లోని రొమాంటిక్ యాంగిల్ ను చూపిస్తూ విడుదల చేసిన టీజర్ పుట్టినరోజు స్పెషల్ గా పేర్కొనవచ్చు.
[m9ad]
ఫస్ట్ లుక్ పోస్టర్ లో చూపించిన ప్రిన్స్ ను వీడియో రూపంలో ప్రజెంట్ చేస్తూ ఫ్యాన్స్ కు సరికొత్త కిక్ ఇచ్చాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో ల్యాప్ టాప్ పట్టుకుని నడిచి వస్తున్న ప్రిన్స్, తల నిమురుకోవడం… అమ్మాయిల వంక ఓరకంటితో చూడడం… “మహర్షి” టీజర్ లో హైలైట్స్.
దేవిశ్రీప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెగ్యులర్ బీట్ కాగా, ముగ్గురు బడా నిర్మాతలు కలిసిన ఈ సినిమాకు ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2019 ఏప్రిల్ 5వ తేదీన “మహర్షి”ని విడుదల చేయబోతున్నట్లుగా ఈ టీజర్ ద్వారా మరోసారి స్పష్టం చేసారు.



