
ఈ టైటిల్ ఖరారుతో ప్రిన్స్ అభిమానుల్లో ఒక్క విషయమైతే స్పష్టమైంది. ఈ సినిమా కధకు సంబంధించి అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే… మహేష్ బాబును ఓ ముఖ్యమంత్రి పాత్రలో కొరటాల శివ చూపించబోతున్నారని సందడి చేసిన వార్తలు దాదాపుగా ఖరారైనట్లే. అంటే 2017లో సిల్వర్ స్క్రీన్ పై ప్రిన్స్ మహేష్ బాబు “భరత్ అనే నేను” అంటూ ప్రమాణ స్వీకారం చేయడం దాదాపుగా ఖరారైన విషయం అన్న మాట.
ఊహించుకుంటేనే ప్రిన్స్ అభిమానుల్లో నూతన ఉత్సాహం, ఉత్తేజం ఉరకలేస్తుంటే… రేపు సిల్వర్ స్క్రీన్ పైన చూస్తే అదిరిపోవడం ఖాయం అంటున్నారు అభిమానులు. ఇప్పటికే కొరటాల – ప్రిన్స్ ఖాతాలో ‘శ్రీమంతుడు’ వంటి భారీ హిట్ ఉండడంతో, ప్రారంభానికి ముందే అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఒక్క టైటిల్ ప్రకటనతో ఆ అంచనాలు తారాస్థాయికి చేరుకోవడం విశేషం.
Did the failure of Alia Bhatt’s Alpha end up affecting other female actors too? Taapsee…
The former chief minister of Andhra Pradesh YS Jagan appears to have collectively decided that…