మహేష్ స్టిల్స్ లో రాజమౌళి రేంజ్ మేకోవర్ మిస్సింగ్

Mahesh Babu Varanasi look

ఒక్క స్టూడెంట్ నెం.1 తప్పితే.. రాజమౌళి తన ప్రతి సినిమాలోనూ హీరోకి తన మార్క్ మేకోవర్ ఇచ్చాడు. అది స్టయిలింగ్ కావచ్చు, బాడీ లాంగ్వేజ్ కావొచ్చు, కచ్చితంగా రాజమౌళి సినిమా అంటే హీరో లుక్ అదిరిపోతుంది.

ఛత్రపతిలో ప్రభాస్ ని రాజమౌళి చూపించిన విధానం అదిరిపోద్ది. బూట్ కట్ జీన్స్ అండ్ టైట్ హాఫ్ హ్యాండ్స్ షర్ట్ లో ట్రైసెప్స్ కనిపించేలా ప్రభాస్ కనిపించిన విధానం తెలుగు యువతను జిమ్ వైపుకు నడిపించిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ADVERTISEMENT

ఇక “యమదొంగ” ఎన్టీఆర్ బెస్ట్ లుక్స్ లో ఒకటి. లాంగ్ హెయిర్ లో ఎన్టీఆర్ లుక్ భలే ఉంటుంది. మగధీరలో చరణ్ రెండు వైవిధ్యమైన వేరియేషన్స్ కూడా బాగుంటాయి. ఇక బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల్లో హీరోల మేకోవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

కానీ.. ఆ రాజమౌళి మార్క్ అనేది ఇప్పటివరకు విడుదలైన “వారణాసి” స్టిల్స్ లో మిస్ అవుతోంది. మహేష్ తాను రెగ్యులర్ కమర్షియల్ యాడ్ ఫిలిమ్స్ లో ఎలా కనిపిస్తాడో.. అదే విధంగా ఉన్నాడు తప్పితే, కొత్తగా ఎలివేట్ అవ్వలేదు. మహేష్ రాముడిగా కనిపిస్తాడని తెలిసినప్పటికీ, లీకైన ఫోటోలు చూసినప్పటికీ.. ఎందుకో రావాల్సిన హై అనేది రావడం లేదు.

రాజమౌళి కూడా రోటీన్ గా పోస్టర్స్ లా కాకుండా.. హాలీవుడ్ స్టైల్లో స్టిల్స్ రిలీజ్ చేస్తూ మంచి పబ్లిసిటీ పద్ధతిని ఫాలో అవుతున్నప్పటికీ.. ఫ్యాన్స్ ని ఖుషీ చేసే స్థాయి మేకోవర్ ఇప్పటివరకైతే మహేష్ కి ఇవ్వలేకపోయాడు. మరి సినిమా ఇంకా విభిన్నమైన వేరియేషన్స్ ఏమైనా ఉన్నాయా? అవెప్పుడూ బయటకు వస్తాయి, ఎలా ఉంటాయి అనేది వేచి చూడాల్సిందే.

ADVERTISEMENT
Latest Stories