మహేష్ ఫ్యాన్స్ ను బాధపెడుతోన్న పోస్టర్!

రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్న కాలంలో విక్టరీ వెంకటేష్ కాంభినేషన్స్ తో వచ్చిన సినిమాలు ఎంతటి ఘనవిజయాలు సాధించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టని రీతిలో “నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి” వంటి సినిమాలు ఇప్పటికీ బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. అయితే “అతడు” సినిమాతో దర్శకుడిగా మారిన త్రివిక్రమ్, మళ్ళీ వెంకీ వైపుకు చూడలేదు.

కానీ ఆ లోటు తాజాగా తీరబోతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో వరుసగా సినిమాలను నిర్మిస్తోన్న ‘హారిక అండ్ హాసిని’ బ్యానర్ విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఓ పోస్టర్ ను విడుదల చేస్తూ ఈ విషయాన్ని ధృవీకరించింది. దీంతో మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇవ్వడానికి వెంకీ – త్రివిక్రమ్ లు కలవబోతున్నారన్న మాట. విక్టరీ పుట్టినరోజున అభిమానులకు అందిన ‘తీపికబురు’గా ఈ పోస్టర్ ను అభివర్ణించవచ్చు.

ADVERTISEMENT

అయితే ఈ పోస్టర్ ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులను మాత్రం కలవరపెడుతోంది. పవన్ తో సినిమా ముగిసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో జత కట్టబోతున్న త్రివిక్రమ్, ఆ తర్వాత మహేష్ తో సినిమా చేస్తారని భావించగా, ప్రిన్స్ స్థానంలో ఇపుడు విక్టరీ వచ్చి చేరడంతో… మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో మూవీ కోసం మరికొన్నాళ్ళు వేచిచూడక తప్పని పరిస్థితి నెలకొంది. పుట్టినరోజుల నాడు ఇలా విడుదల చేసిన పోస్టర్లకు కొదవలేదు గానీ, ఇది కార్యరూపం దాలిస్తేనే వెంకీ అభిమానులైనా సంతోషించేది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

నాగవంశీపై ఒక్కసారిగా ఇంత రచ్చ ఎందుకు?

సినిమా రిలీజ్‌కు ముందు నిర్మాత నాగవంశీ పేరు ట్విట్టర్‌లో తెగ తిరుగుతోంది. సినిమా గురించి కాదు. ఆయన వ్యక్తిగత జీవితంపై…

18 minutes ago

Sanjay Leela Bhansali’s New Historical Epic: Star Cast?

While Sanjay Leela Bhansali is busy completing Love & War, he has been equally working…

21 minutes ago