
మెగా ఫ్యామిలీ తన ఆస్తులేవీ దోచుకోలేదని, వ్యక్తిగత శతృత్వం లేదని, ఎవరి సినిమాలైనా బాగుంటే బాగున్నాయని చెప్తామని, లేకుంటే బాగాలేదని చెప్తామని, అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం వారి అభిమాన హీరోల సినిమాలు బాగోలేదని చెప్తే స్వీకరించరని అభిప్రాయపడ్డారు. కేవలం మెగా ఫ్యాన్స్ చేస్తున్న కార్యాలతోనే తాను ఇబ్బందులు పడుతున్నానని, దీని వెనుక మెగా హీరోలు ఉన్నారా? అభిమానులను వారే ఈ విధంగా చేయమని ప్రోత్సహిస్తున్నారా? ఇవన్నీ తనకు తెలియదు గానీ, ‘సంథింగ్’ ఏదో ఉన్నట్లుగా తనకు అనిపిస్తోందని అన్నారు.
ఏ హీరో సినిమాలు బాగోకపోయినా ఒక విశ్లేషకుడిగా తాను పంచుకుంటానని, అలా చెప్పడం తన విధి నిర్వహణ అని, మహేష్ బాబు అభిమానులు ఏమీ పట్టించుకోరని, అలాగే ‘నాన్నకు ప్రేమతో’ సినిమా తనకు నచ్చలేదని, తాను అదే చెప్పానని, అలా అని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తనపై ఏమీ దాడి చేయలేదని, వ్యక్తిగత దూషణలకు దిగలేదని, ‘కాటమరాయుడు’ విషయంలో ఈ మెగా ఫ్యాన్స్ వ్యక్తిగత దూషణలతో పాటు అసభ్యకర పదజాలాన్ని వినియోగించారని, కుటుంబ సభ్యులను కూడా దూషించారని తెలిపారు.
పబ్లిక్ ఫ్లాట్ ఫామ్స్ పై తన మొబైల్ నెంబర్ పెట్టి మరీ తిట్టించాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని, సోషల్ మీడియా వేదికగా మెగా ఫ్యాన్స్ చేస్తున్న తీరును తప్పుపట్టారు. మారాల్సిన అవసరం వారికే ఉందని, లేదంటే నష్టపోయేది కూడా వాళ్ళేనని మెగా ఫ్యాన్స్ ను హెచ్చరించిన మహేష్ కత్తి, ఇక్కడ తాను చవిచూసిన ఇబ్బంది కేవలం వారితోనే అంటూ స్పష్టత ఇచ్చారు. తనను బాగా ఇబ్బంది పెట్టిన మెగా ఫ్యాన్స్ మదిలో మహేష్ ‘కత్తి’ పోట్లు ఈ సందర్భంగా బాగానే దించాడని చెప్పవచ్చు.
Telugu cinema has always been heavily dependent on star power. Big heroes bring big openings,…
Pawan Kalyan was one of the individuals to firmly stand by the Chandrababu Naidu family…