Telugu

ఏపీ బంద్ కు కత్తి మహేష్ మద్దత్తు

వివాదాస్పద సినీ విమర్శకుడు కత్తి మహేష్ విజయవాడ చేరుకొని ఏపీ బంద్ కు తన మద్దత్తు ప్రకటించారు. లెనిన్ సెంటర్లో నిరసన తెలుపుతున్న కమ్యూనిస్టులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు జరుగుతున్న అన్యాయాన్ని అందరూ ఖండించాలని, రాష్ట్రానికి న్యాయం జరిగేలా అందరు కలిసి పోరాడాలని ఆయన చెప్పారు.

ప్రత్యేక హోదాకోసం. విభజన హామీల కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చెయ్యాలన్న పవన్ కళ్యాణ్ ప్రకటనకు ఆయన విమర్శించారు. “జనసేన నాయకత్వం. ఉండవల్లి, జేపీ లాంటి మేధావులతో కమిటీ. వినడానికి బాగుంది. చలసాని శ్రీనివాస్, హీరో శివాజి, వామపక్షాలు,ప్రజాసంఘాలు ఏర్పాటు చేసిన కమిటీ ఆల్రెడీ ఉంది. పవన్ కళ్యాణ్ వచ్చి చేరితే బావుంటుంది,” అని ఆయన అన్నారు.

ADVERTISEMENT

మరోవైపు రాష్ట్రబంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. వైకాపా, కాంగ్రెస్‌, జనసేన పార్టీలతో సహా వివిధ సంఘాలు మద్దతు తెలుపుతూ బంద్‌లో పాల్గొంటున్నాయి. మరో వైపు టీడీపీ రాష్ట్ర బంద్ కు పరోక్షంగా మదత్తునిచ్చింది. పలుచోట్ల టీడీపీ కార్యకర్తలు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

పులివెందులలో ఓట్ల పోరా.. హింసా రాజకీయమా?

దశాబ్దాలుగా వైఎస్‌ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులలో టీడీపీ చరిత్ర సృష్టించింది. మొత్తం 40 వార్డుల్లో 20 వార్డులను ఏకగ్రీవంగా…

18 minutes ago

AP Municipal Elections: Is the State Bracing for Poll-Day Violence?

With just a day left for the Andhra Pradesh municipal elections, the scale of security…

30 minutes ago