
‘అతిలోక సుందరి’ శ్రీదేవి నుండి సుష్మితా సేన్, టబు వంటి ప్రముఖ తారలను రాజమౌళి సంప్రదించగా, వారంతా రాజమౌళి పాత్రను రిజెక్ట్ చేసి, తగిన న్యాయం చేసారు. అయితే తాజాగా మంచు లక్ష్మిని కూడా రాజమౌళి అడిగారన్న విషయం వెలుగుచూసింది. ‘శివగామి’ పాత్ర కోసం తనను సంప్రదించారని, అయితే ప్రభాస్ కు, రానాకు తల్లిగా తానూ నటించడమేంటని ఒప్పుకోలేదని, ఈ పాత్రను ఒప్పుకోనందుకు తానేమీ బాధపడడం లేదని చెప్పుకొచ్చింది.
నిజానికి ఆ పాత్రను ఒప్పుకోకపోవడమనేది రాజమౌళి అదృష్టంగానే భావించాలి. రమ్యకృష్ణ ప్రదర్శించిన అభినయం ఖచ్చితంగా మంచు లక్ష్మి నుండి ఆశించలేం. అతి సాధారణ పాత్రల్లోనే అంతగా మెప్పించలేని మంచు లక్ష్మి, ‘శివగామి’ వంటి పవర్ ఫుల్ పాత్రల్లో మెప్పించడం అంటే అది ఊహలకందేది కాదు. బహుశా మంచు లక్ష్మి ఒప్పుకుని ఉంటే ‘బాహుబలి’ ఫలితం ఎలా ఉంటుందో కూడా అంచనాలు వేయసాధ్యం కాదని, సదరు సంగతులు తెలుసుకున్న నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మంచు వారమ్మాయి అభినయం చూసిన వారు… తప్పులేదులే అంటున్నారు మరి!
The Telangana Exhibitors Association has officially decided to stop the culture of hiked ticket prices…
నేడు ఎర్రవల్లి ఫామ్‌హౌసులో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. దానిలో పార్టీ కమిటీల ఏర్పాటు,…