
[m9ad]
థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమాలు సాధారణంగా చాలా తక్కువ నిడివి ఉంటాయి. రెండు గంటల వ్యవధిలో ఉండే థ్రిల్లర్ జోనర్ ను దాదాపుగా మూడు గంటల నిడివితో “మను” తెరకెక్కించినట్లుగా స్పష్టం చేసారు. ఈ 180 నిముషాల నిడివిలో కేవలం 45 నిముషాల పాటు మాత్రమే డైలాగ్స్ వినిపిస్తాయట. మరి మిగిలిన 135 నిముషాల పాటు ఏం జరుగుతుంది? అంటే, దానికే సినిమా చూడమంటున్నారు.
ఈ 135 నిముషాలలో ఎక్కువగా శాతం సైలెన్స్, ష్…, బ్యాక్ గ్రౌండ్ స్కోర్… తదితర అంశాలు నిండి ఉంటాయట. ‘బాహుబలి 2’ వంటి అడ్వెంచర్స్ సినిమాలు, ‘రంగస్థలం, భరత్ అనే నేను’ వంటి కమర్షియల్ సినిమాల నిడివి మూడు గంటలు పాటు ఉండడమే చర్చనీయాంశం కాగా, ఓ థ్రిల్లర్ ను 3 గంటల పాటు ఎంత విజయవంతంగా నడిపారో ఈ నెల 7వ తేదీన తేలనుంది.
అతి తీవ్ర తుఫాన్ గా ఆంధ్రప్రదేశ్ ను భయపెట్టిన అర్నాబ్ తుఫాన్ యానాం, నర్సాపురానికి మధ్య తీరం దాటినట్లు వాతావరణ…
చొక్కా మడత పెడతా....జగన్ 2.0 చూపిస్తా, రప్ప రప్ప రాజకీయం, మేము అధికారంలోకి వస్తే ఎక్కడున్నా వదిలిపెట్టం....ఇలా వైసీపీ క్యాడర్…