“రాక్షసుడు పోయి రాజాసాబ్” వచ్చాడు.!

Prabhas The Raja Saab

మారుతితో ప్రభాస్ చేయబోయే సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను సంక్రాంతి కానుకగా విడుదల చేసారు ఆ చిత్ర యూనిట్. ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న మీ “ది రాజాసాబ్” ని ఈ సంక్రాంతి కానుకగా మీకు పరిచయం చేస్తున్నాం, మీ ఆశీస్సులు కావాలి అంటూ X వేదికగా చిత్ర దర్శకుడు మారుతీ తన ఆలోచనలు పంచుకున్నారు.

పోస్టర్ లో నల్ల చొక్కా, లుంగీతో ప్రభాస్ ను మాస్ లుక్ లో చూపించారు. సాలార్ లో రెబెల్ స్టార్ గా ప్రేక్షకులని అలరించిన ప్రభాస్, ఈసారి డార్లింగ్ రూపం లో అభిమానుల ముందుకు వస్తున్నట్లు తెలుస్తుంది. బాహుబలి సిరీస్ తరువాత నుండి ప్రభాస్ ఒక్క కథాశైలికే కట్టుబడి ఉండకుండా విభిన్నమైన క్యారెక్టర్స్ తో బాక్స్ ఆఫీస్ వద్దకు వస్తున్నాడు.

ADVERTISEMENT

ఈసారి దర్శకుడు మారుతి తో కలిసి హారర్, కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న “ది రాజాసాబ్” పోస్టర్ ను ఈ సంక్రాంతి పండక్కి డార్లింగ్ ఫాన్స్ కు ఊహించలేని బహుమతి ఇచ్చారు. అయితే, ఇప్పటికే సంక్రాంతి కి ” కల్కి 2898 AD ” చిత్ర యూనిట్ విడుదల తేదీ ని ప్రకటించటం తో సంబరాలు చేసుకుంటున్న డార్లింగ్ ఫాన్స్, నేడు మరొక పోస్టర్ రావటం తో సోషల్ మీడియా లో డార్లింగ్ అభిమానులు తెగ మురిసిపోతున్నారు.

ప్రస్తుతం ఈ పోస్టర్ ని వైరల్ చేస్తూ,టాప్ ట్రెండింగ్ లో నిలబెట్టారు. ఇక పోతే, సాలార్ లో రెబెల్ స్టార్ రాక్షసుడి అవతారాన్ని ఇంకా మర్చిపోని ఫాన్స్ కు అప్పుడే రాజాసాబ్ అవతారాన్ని సైతం పరిచయం చేశారు చిత్ర యూనిట్. దీనితో “రాక్షసుడు పోయి రాజాసాబ్ వచ్చేసాడు” అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories