అబ్బే… బన్నీకి అసలు నప్పలేదు..!

Allu Arjun Ey Bidda Song Lookసుకుమార్ – అల్లు అర్జున్ ల కాంబోలో రాబోతున్న “పుష్ప” సినిమాకు సంబంధించిన నాలుగవ పాట ‘ఏయ్ బిడ్డా… ఇది నా అడ్డా…’ ఈ రోజు విడుదలైన విషయం తెలిసిందే. ఫ్యాన్స్ కు ఊపు వచ్చే విధంగా పవర్ ఫుల్ మాస్ లిరిక్స్ తో రాసిన ఈ పాట అల్లు అర్జున్ అభిమానులను అలరిస్తోంది.

అయితే ఈ పాటలో బన్నీ కనిపించిన తీరులో గానీ, వేసిన స్టెప్స్ లో గానీ హీరో గారు సహజంగా ఉన్న ఫ్లో మిస్ అయ్యిందనేది పరిశీలకుల మాట. ఈ మాస్ పాటకు సెట్ కావాలని ఏదో బలవంతంగా చేసిన ప్రయత్నంగా ఉందని, అల్లు అర్జున్ కు అంతగా సూట్ కాలేదని నెటిజన్లు షేర్ చేస్తోన్న టాక్.

ADVERTISEMENT

బహుశా తమిళ హీరోలు ధనుష్ లాంటి వారికైతే బన్నీ గెటప్ కరెక్ట్ గా సెట్ అయ్యుండేదనేది ఈ టాక్ సారాంశం. ఏది ఏమైనా “పుష్ప”తో తాను సరికొత్తగా కనిపించాలని అల్లు అర్జున్ చేస్తోన్న ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతం అవుతుందో డిసెంబర్ 17వ తేదీన తెలియనుంది.

ADVERTISEMENT
Latest Stories