
ఇదిలా ఉంటే తాజాగా తెలుగుదేశం సోషల్ మీడియా వింగ్ ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఏపీలో కరెంట్ కోతలు ఎంత పతాక స్థాయికి చేరుకున్నాయో చెప్పడానికి నిదర్శనంగా ఈ వీడియో నిలుస్తోంది. ఓ వివాహ వేడుకలో బహుమతి రూపంలో విసనకర్రలను అందివ్వడం హైలైట్ అయ్యింది.
అంతేకాదు ఎదురుగా ఉన్న మహిళలు మరో మెట్టు పైకి తీసుకెళుతూ, ‘ఒకరికొకరు విసురుకొండి’ అంటూ కొత్త జంటను ఆటపట్టించడం ఈ వీడియోలో స్పష్టంగా వినవచ్చు. అయితే ఇదంతా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుణ్యం వల్లనే అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
2014లో అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే అప్పటివరకు ఉన్న కరెంట్ కోతలను పూర్తిగా నిర్మూలించి, గ్రామగ్రామాల్లో కూడా 24×7 నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఇచ్చిన ఘనత చంద్రబాబుకు సొంతం. నాటి నుండి మొదలుపెడితే, 2019లో అధికారం నుండి వెళ్లిపోయే సమయానికి ఏపీ మిగులు విద్యుత్ లో ఉంది.
ఇక 2019లో అధికారం చేపట్టిన నాటి నుండి విద్యుత్ చార్జీలను భారీగా పెంచడంతో పాటు, వివిధ రకాలుగా విద్యుత్ సుంకాలను విధిస్తూ వచ్చిన జగన్ సర్కార్, ఈ ఏడాదిలో పూర్తిగా చేతులెత్తేసింది. అంతేగాక “ప్రజలు త్యాగాలకు సిద్ధంగా ఉండమంటూ” పిలుపునిచ్చింది. ‘త్యాగం’ అంటే మరీ ఈ రేంజ్ లో ఉంటుందని మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఊహించలేదు.
‘పవర్’ వినియోగంలో పూర్తిగా ఫెయిల్ అయిన జగన్ సర్కార్ తీరును సోషల్ మీడియా ద్వారా ట్రెండ్ కు అనుగుణంగా నెటిజన్లకు చేరువ చేయడంలో టీడీపీ నిమగ్నమయ్యింది. గత పది రోజులుగా అనేక మేమ్స్ ఇప్పటికే సోషల్ మీడియాను చుట్టేయగా, ఇప్పుడు వీడియోలు కూడా ప్రత్యక్షం అయ్యాయి.
Andhra Pradesh has just hit a major milestone, securing 2nd place in the National Panchayat…
Following the pan-India success of Kalki 2898 AD, Prabhas is now preparing for the much-awaited…