
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఈ మధ్య రెండు పదాలు తరచూ మీడియాలో వినిపిస్తున్నాయి, ప్రజల చెవులలో మారుమోగుతున్నాయి. అందులో ఒకటి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ కాగా రెండవది టీడీపీ అధినేత బాబు ప్రచారం చేస్తున్న ‘గొడ్డలి పార్టీ’.
అయితే ఈ రెండు పదాలు కూడా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉంటున్నాయి. రాష్ట్ర రాజధానిగా అమరావతి చట్టబద్దత లభించిన సమయంలో మీడియా ముందుకొచ్చిన జగన్ రాజధానిగా అమరావతిని పక్కన పెట్టి మావిగాన్ ను అభివృద్ధి చేయాలంటూ మావిగన్ పేరును ప్రతిపాదించారు.
అయితే జగన్ ప్రతిపాదనకు మరింత బలం చేకూర్చడానికి వైసీపీ నాయకులంతా మావిగన్ నినాదంతో మీడియాలో హడావుడి చేసారు. గతంలో జగన్ సూచిన మూడు రాజధనులను కాదని , విశాఖ రాజధాని ని పక్కన పెట్టి మరి వైసీపీ నాయకుల నుంచి ఆ పార్టీ కార్యకర్త వరకు మావిగన్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమంటూ మావిగన్ జపం చేసారు.
దీనితో ఏపీ రాజకీయాలలో మావిగన్ హాట్ టాపిక్ అయ్యింది. ఇటు మీడియాలో మొదలుకుని అటు సోషల్ మీడియా వరకు ఏపీ వార్తలన్నీ మావిగన్ కేంద్రంగానే నడిచాయి. ఇలా వైసీపీ 7 కోట్ల రాష్ట్ర ప్రజల భవిష్యత్ పైనా, వారి మనోభవాల పైన రాజకీయం చేస్తూ పూటకోమాట, ఏడాదికో ప్రాంతం అంటూ రాజధానిని వైసీపీ రాజకీయంలో భాగం చేసేసింది.
ఇక జగన్ మావిగన్ ఏపీ రాజకీయాలను ఎంతలా ప్రభావితం చేసిందో ఇక ఇప్పుడు బాబు గొడ్డలి పార్టీ కూడా ఏపీ రాజకీయాలలో అంతే సంచలనంగా మారింది. ముఖ్యంగా వైసీపీ ఈ గొడ్డలి పార్టీ అనే ప్రచారంతో రాజకీయంగా చాల ఇబ్బందిపడుతుంది.
సీఎం బాబు నుంచి ఐటీ మంత్రి లోకేష్ వరకు టీడీపీ నాయకుల నుంచి టీడీపీ క్యాడర్ వరకు ఇప్పుడు వైసీపీ పార్టీని గొడ్డలి పార్టీగా ప్రచారం చేస్తున్నారు. టీడీపీ పార్టీ సమావేశాలలోను, ప్రభుత్వ కార్యక్రమాలలోను వైసీపీ ప్రస్తావన వస్తే చాలు టీడీపీ శ్రేణులంతా ఆ స్థానంలో వైసీపీ కి బదులు గొడ్డలి పార్టీ అంటూ వైసీపీ పై విమర్శలు సాగిస్తున్నారు.
దీనితో వైసీపీ రాజకీయంగా ఇబ్బందిపడుతుంది. గొడ్డలి అనగానే ఏపీలో అందరికి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యే జ్ఞప్తికి రావడం, ఆ హత్యకు అవినాష్ రెడ్డే ముఖ్య కారకుడు అంటూ సునీత, షర్మిల చేస్తున్న విమర్శలు మనసును తాకడం వైసీపీ కి పెద్ద రాజకీయ ఎదురుదెబ్బగా మారుతుంది.
మావిగన్ అనేది వైసీపీ పట్ల భస్మాసుర హస్తంగా మారితే గొడ్డలి పార్టీ అనేది వైసీపీ పాలిట వామనవతారం గా మారే ప్రమాదం ఉంది. కాబట్టి సాధ్యమైనంత మేరకు వైసీపీ, తానూ మొదలుపెట్టిన ఈ మావిగన్ ప్రచారాన్ని ముగించాలి, అలాగే టీడీపీ అందుకున్న గొడ్డలి పార్టీ నినాదాన్ని నివారించాలి.
జగన్ మావిగన్ ప్రచారం వైసీపీ కి ఎంత రాజకీయ నష్టం చేకూరుస్తుందో, టీడీపీ గొడ్డలి పార్టీ నినాదం కూడా వైసీపీ కి రాజకీయంగా అంతే ప్రమాదకరంగా మారుతుందని వైసీపీ గ్రహించాలి. లేకుంటే వైసీపీ రాజకీయంగా మరోసారి కూడా భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందేమో బహుశా…!
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…