
గత ఐదేళ్ల వైసీపీ గ్రహణం నుంచి వెలుగులు చూస్తున్న ఏపీ రాజధాని అమరావతి మే 2 న దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాజధానిగా పట్టాభిషేకానికి సిద్దమవుతుంది.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అమరావతికి తిరిగి జీవం పొసే ప్రక్రియలో భాగంగా విభజన గాయాలతో, వైసీపీ రాజకీయాలతో చితికిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఊపిరి పోసేలా, ఏపీ ప్రజల ఆకాంక్షలు చిగురించేలా ఏదైనా ప్రకటన చేస్తారా అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతుంది.
2015 లో మోడీ చేతుల మీదుగా పునాదులు వేసుకున్న ఏపీ రాజధాని వైసీపీ హయాంలో సమాధి చేయబడింది. అయితే తిరిగి 2025 లో మరోసారి అదే వ్యక్తి చేతుల మీదుగా ఈ రాజధాని పనులు పట్టాలెక్కబోతున్నాయి. అంటే అమరావతిని పూర్తి చేసే బాధ్యత అటు బీజేపీ పై కూడా ఉన్నట్టుగానే భావించాలి.
ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి ఏ మేరకు నిధుల విడుదల ఉండబోతుంది, మరోసారి ప్రభుత్వాలు తారుమారైన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అన్న బలమైన సంకేతాలు మోడీ ఏపీ ప్రజలకు ఇవ్వగలరా.? అన్న అంశం మీద కూడా ప్రజలలో చర్చ జరుగుతుంది.
రాజకీయ అనిచ్చితి తావివ్వకుండా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ను తీర్చిదిద్దేలా అమరావతి రూపకల్పన చేయాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ లక్ష్యానికి మే 2 ఒక రూపం ఇవ్వబోతుంది. అమరావతి నిర్మాణాలతో అటు ఏపీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది.
అలాగే అనేక భవన నిర్మాణాల పనులతో వేలాదిమందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. దానితో పారిశ్రామిక వేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతూ ముందుకొస్తారు. దానికి తోడు ఏపీని ఎడ్యుకేషనల్ హబ్ గా రూపొందించేందుకు బాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుతవల సహాయ సహకారాలతో అనేక విద్యాసంస్థలను, యూనివర్సిటీలను ఏపీకి ఆహ్వానించేందుకు విద్య శాఖ మంత్రిగా లోకేష్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన బిట్స్ ఏపీకి రప్పించేందుకు లోకేష్ సర్వ శక్తులు ఒడ్డారు. ఇలా ఒక్క స్థిరమైన నగర అభివృద్ధి ఆ రాష్ట్ర భవిష్యత్ ను మార్చగలదు.
తెలంగాణకు హైద్రాబాద్, తమిళనాడుకి చెన్నై, కర్ణాటకకు బెంగళూర్ మాదిరి ఆంధ్రప్రదేశ్ కు అమరావతి ఒక ప్రతిష్టాత్మక నగరంగా మారడానికి మే 2 అంత్యంత కీలకం కానుంది. పదేళళ్ ఆంధ్రుల నిరీక్షణకు, వారి అవమానాలకు అమరావతి తన అభివృద్ధితో బదులు చెప్పాలంటూ ప్రతి ఆంధ్రుడు మనసారా కోరుకుంటున్నాడు.
Nani's latest film The Paradise marked one of the most ambitious attempts of his career.…
Vijay Deverakonda appears unfazed by the slow start to Ranabaali’s North American advance bookings. The…