తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 14వ తేదీన విడుదల కాబోతున్న విజయ్ “పోలీసోడు” సినిమాలో ఒకప్పటి హీరోయిన్ మీనా కూతురు ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ధియేటిరికల్ ట్రైలర్ లో విజయ్ తర్వాత చిన్నారి నైమికనే హైలైట్ అయ్యింది. అయితే వెండితెరపై మంచి హావభావాలు పండించడం మాత్రమే కాదు, తెరవెనుక తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం.
నైమిక డబ్బింగ్ చెప్తున్న ఒక ఫోటోను ఈ సినిమా దర్శకుడు అట్లీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. తల్లి మీనా బ్యాక్ గ్రౌండ్ లో నవ్వుతుండగా, మైకు ముందు నైమికను ఒళ్లో కూర్చోబెట్టుకుని డబ్బింగ్ చెప్పిస్తున్న చిత్రాన్ని అట్లీ తన అభిమానులతో పంచుకున్నాడు. గడుగ్గాయిలా కనపడుతున్న నైమిక డబ్బింగ్ తీరును చూసి… ఔరా అనుకోవడం చిత్ర వర్గాల వంతయ్యింది మరి!
ADVERTISEMENT
ADVERTISEMENT



