మీడియా తో మెగాస్టార్ ముచ్చట్లు. ఇండస్ట్రీలో హాట్ డిస్కషన్స్ !

Megastar Chiranjeevi chitchat with media people hot discussion in TFIఆచార్య అపజయం తో డీలా పడ్డ మెగాస్టార్ చిరంజీవి, మళ్ళీ గాడ్ ఫాదర్ సినిమాతో ఊపందుకుని, సరికొత్త ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు. గాడ్ ఫాదర్ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే సూచనలు లేకపోయినా..అభిమానులు, ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూసి మెగాస్టార్ ఊపిరి పీల్చుకుంటున్నారు. సినిమా ప్రచారాల్లో, వివాదాల్లో పడి అలసిపోయిన మెగాస్టార్ కొన్ని రోజులు సినిమా షూటింగులకు విరామం ఇచ్చి, కుటుంబంతో విదేశాల్లో విహార యాత్రకు వెళ్ళబోతున్నారు.

ఆసక్తి కరమైన విషయం ఏంటంటే..మెగాస్టార్ చిరంజీవి కొన్ని రోజుల ముందు నుండి పాత్రికేయులు, మీడియా ప్రముఖులను కలుస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశాల్లో చిరంజీవి జర్నలిస్ట్ ల అవసరాలను అడిగి మరీ తెలుసుకుంటున్నారట. అలాగే సీనియర్ జర్నలిస్ట్ లతో తెలుగు సినిమా అసోసియేషన్ల గురించి చర్చిస్తున్నారట. మెగాస్టార్ చిరంజీవి సినిమా అసోసియేషన్ల కోసం ప్రత్యేకంగా రెండు గంటలపాటు సమయాన్ని వెచ్చించడం జర్నలిస్టులను ఆనందానికి గురిచేస్తున్నాయి. అలాగే వాళ్ళ సాధక బాదకాలని మెగాస్టార్ అడిగి తెలుసుకోవడం మరింత ఆనందాన్నిస్తున్నాయట.గాడ్ ఫాదర్ సినిమా గురించి, బాబీ దర్శకత్వంలో రాబోతున్న తన 154 వ సినిమా గురించి విలేఖరులతో చర్చిస్తున్నారట మెగాస్టార్.

ADVERTISEMENT

సాధారణంగా సినిమా ప్రచారం తరువాత స్టార్ హీరోలు మీడియా తో కలవడం చాలా అరుదు. మెగాస్టార్ చిరంజీవి మాత్రం ప్రత్యేకంగా ఎందుకు ఈ చర్చలు జరుపుతున్నారు? ఏదేమైనా ఈ మెగా సమావేశాలు ఫిలింనగర్ లో ఆసక్తికరమైన చర్చలకు దారితీసాయి. త్వరలో మెగాస్టార్ మొత్తం మీడియా తో సమావేశం జరుపుతారని, అప్పుడు అసలు ఈ చర్చలెందుకు జరుపుతున్నారో పూర్తిగా తెలుస్తాయని కొందరంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories