చిరంజీవి అప్పుడు హ్యాండ్ ఇచ్చి, ఇప్పుడు ఒప్పుకున్నారా?

Megastar Chiranjeevi  purijagannadh movieకరోనావైరస్ లాక్డౌన్ మొత్తం తెలుగు సినిమా పరిశ్రమను ఎక్కడికి అక్కడ ఆపేసింది.. పూరి జగన్నాధ్ ముంబైలో తన ఫైటర్ యొక్క ప్రధాన షెడ్యూల్ను పూర్తి చేసి, లాక్డౌన్ ప్రకటించే సమయానికి హైదరాబాద్ చేరుకున్నారు. లాక్డౌన్ పూర్తయిన తర్వాత ఫైటర్ షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుంది. ఈ దర్శకుడు ఇప్పుడు ఈ విరామాన్ని సమర్థవంతంగా ఉపయోగిస్తున్నారు.

ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పూరి జగన్నాధ్ తన తదుపరి చిత్రానికి స్క్రిప్ట్ రాస్తున్నట్లు వెల్లడించారు. అతను విజయ్ దేవరకొండ సినిమాకు బౌండెడ్ స్క్రిప్ట్ రాసినందున, దానిని చిత్రీకరించడం తప్ప ఇంకేమీ లేదు కాబట్టి వేరే సినిమా స్క్రిప్ట్ రాస్తున్న అని చెప్పుకొచ్చాడు. అయితే దానికి హీరో ఎవరు అనేది మాత్రం చెప్పలేదు.

ADVERTISEMENT

అయితే, ఫిల్మ్‌నగర్‌లో పుకార్లు ఏమిటంటే, పూరి మెగాస్టార్ చిరంజీవి కోసమే ఈ స్క్రిప్ట్ రాస్తున్నారట. పూరి ఆటో జానీ సినిమాని చిరంజీవి 150 వ చిత్రంగా చేయాల్సి ఉంది. అధికారిక ప్రకటన తర్వాత ఈ ప్రాజెక్ట్ నిలిపివేయబడింది. రిస్క్ లేకుండా ఒక రీమేక్ సినిమాని చిరంజీవి అప్పట్లో చేసేసి 100 కోట్ల షేర్ కొట్టేశారు.

ఇంకో సినిమా చేస్తా అని పూరికి అప్పట్లోనే మాట ఇచ్చారట. ఈ మధ్య పూరి దశ తిరిగి ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి తిరిగి వచ్చాడు. దీనితో చిరంజీవి ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతుంది. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories