సత్యదేవ్ సినిమాకు మరింత గ్లామర్

satya devప్రామిసింగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా కన్నడలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన లవ్ మాక్ టైల్ సినిమాను తెలుగు లో రీమేక్ చేయడానికి రంగం సిద్ధం అయ్యింది. దానికి గుర్తుందా శీతాకాలం అనే టైటిల్ ఫైనల్ చేశారు. నాగ శేఖర్ మూవీస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా భావన రవి నిర్మాతగా నాగ శేఖర్ స్వీయ నిర్మాణ దర్సకత్వంలో ఈ బ్లాక్ బస్టర్ రీమేక్ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నారు.

ADVERTISEMENT

ఈ చిత్ర షూటింగ్ ని న‌వంబ‌ర్ 6 నుండి హైద‌రాబాద్ లో ప్రారంభిస్తున్నారు. ఈ చిత్రానికి మరింత గ్లామర్ యాడ్ చేస్తున్నారు చిత్రనిర్మాతలు. ఈ సినిమాలో ఒక కీలక గెస్ట్ రోల్ కోసం… మేఘా ఆకాష్ ని తీసుకున్నారు. ఈ చిత్రానికి హ్యాపెనింగ్ మ్యూజిక్ సెన్సేషన్ స్వరవాణి కీరవాణి వారసుడు కాల భైరవ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు చెందిన ఆడియో రైట్స్ ని ఫ్యాన్సీ రేట్ ఇచ్చి కొనుగోలు చేశారు. సత్య హెగ్డే సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయబోతున్నారు. ఇకపోతే ఈ మధ్య సత్యదేవ్ 47 డేస్ అనే సినిమా థియేటర్లలో విడుదల కాకుండా డైరెక్టుగా ఆన్ లైన్ లోకి వచ్చింది. ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ఆయన మరో సినిమా ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య కూడా డైరెక్టుగా నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయ్యి మంచి పేరు తెచ్చుకుంది. కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా తో సెన్సషనల్ డెబ్యూ చేసిన వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కాకుండా సత్యదేవ్ కు తిమ్మరుసు అనే మరో సినిమా కూడా ఉంది.

ADVERTISEMENT
Latest Stories