క్రేజీ సినిమాలో నటిస్తున్న ఆ హీరోయిన్ కు పెళ్లి కుదిరిందా?

Mehrene Kaur Pirzada - Bhavya Bishnoi‘హనీ ఈజ్ ద బెస్ట్’ అంటూ ఎఫ్2 సినిమాతో ప్రేక్షకుల మీద తనదైన మార్క్ వేసిన మెహ్రీన్ ఆ సినిమా బ్లాక్బస్టర్ హిట్ తరువాత అవకాశాలు వరుసకడతాయి అనుకుంది. అయితే అటువంటిది ఏమీ జరగలేదు. వచ్చిన ఒకటి రెండు ఆఫర్లు కూడా పెద్దగా పని అవ్వలేదు. తాజాగా ఆమె ఎఫ్3 లో షూటింగ్ లో బిజీగా ఉంది. ఈ తరుణంలో ఆమెకు పెళ్లి జరగబోతుంది అంటూ పుకార్లు వస్తున్నాయి.

ADVERTISEMENT

హర్యాణ మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్యతో మెహ్రీన్ కు పెళ్లి సెట్ అయిందట. పెళ్లి కొడుకు భవ్య బిష్ణోయ్ తండ్రి కుల్దీప్, ప్రస్తుతం అదంపూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చేనెల 13న వీళ్ల ఎంగేజ్ మెంట్ కూడా జరగబోతుంది అని గట్టిగా వినబడుతుంది. రాజస్థాన్ లోని జైపూర్ లో ఈ నిశ్చితార్ధానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం.

వీరిద్దరూ ఫోటో ఒకటి కూడా నెట్లో చక్కర్లు కొడుతుంది. పెళ్లిపై వస్తున్న రూమర్లపై మెహ్రీన్ గానీ అబ్బాయి వైపు వారుగానీ స్పందించలేదు. కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన మెహ్రీన్ కెరీర్ లో ఇప్పుడే నిలదొక్కుకునే అవకాశాలు వస్తున్న తరుణంలో పెళ్లి చేసుకోవడం విశేషమే.

ఇది ఎలా ఉండగా… అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఎఫ్3 షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఆ సినిమా ఆగష్టు 27న విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించారు. ఎఫ్2 మాదిరిగానే వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ ఎఫ్3 లో కనిపించనుంది.

ADVERTISEMENT
Latest Stories