మహేష్ బాబు అభిమానులకు నిరాశ!

Mahesh Babu Family Photo Airport, Mahesh Babu Family London, Mahesh Babu Family photos, Mahesh babu family holidays, Mahesh family, Mahesh Babu Family picsజూలై 15వ తేదీ నుండి సెట్స్ పైకి వెళ్ళబోతున్న మురుగదాస్ చిత్రంలో ప్రిన్స్ మేకోవర్ కానున్నారని, ముఖ్యంగా మునుపెన్నడూ లేని విధంగా గడ్డంలో కనిపించబోతున్నారని వార్తలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. లండన్ ఫ్యామిలీ పిక్స్ లో మహేష్ కనపడకపోవడం వీటికి మరింత బలాన్నిచ్చింది. అయితే తాజాగా సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఓ ఫోటోతో ప్రిన్స్ అభిమానులు నిరాశ చెందుతున్నారు.

మొదటిసారిగా మహేష్ ను గడ్డం పెంచుకున్న రూపంలో చూద్దామని భావించిన ప్రిన్స్ అవతారం, అలా కాకుండా ఎప్పటి మాదిరే సింపుల్ గా దర్శనమివ్వడం విశేషం. దీంతో ప్రిన్స్ మేకోవర్ మాట ఒత్తి రూమర్ గానే మిగిలిపోయింది. లండన్ నుండి హైదరాబాద్ విచ్చేసిన సమయంలో విమానాశ్రయంలో సితారను భుజాన వేసుకుంటూ ఫ్యామిలీతో ల్యాండ్ అయిన మహేష్ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ADVERTISEMENT

దీంతో మురుగదాస్ సినిమాలో కూడా ప్రిన్స్ లుక్ పై పెద్దగా మార్పులుండవన్న సంకేతాలు వెలువడుతున్నాయి. షూటింగ్ కు మరో 20 రోజుల సమయం మాత్రమే ఉండడంతో.., ఇంత తక్కువ వ్యవధిలో లుక్ ను మార్చడం సాధ్యం కాదు గనుక, ప్రిన్స్ లుక్ పై ఉన్న ఆసక్తి తగ్గిపోయింది. ‘శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం’ రెండు చిత్రాలలోనూ ప్రిన్స్ ఒకే విధంగా కనపడడంతో, కొత్త చిత్రంలో అయినా సరికొత్తగా దర్శనమిస్తారేమోనని అభిమానులు ఆకాంక్షించారు.

ADVERTISEMENT
Latest Stories