
వైసీపిలో జగన్ మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పుకొనేది ఒకటే… ప్రజలకు ‘మేలు చేశామని’! రాజధాని నిర్మించకుండా, రాష్ట్రాభివృద్ధి చేయకుండా, పరిశ్రమలు, ఐటి కంపెనీలను తెచ్చి ఉద్యోగాలు కల్పించకుండా, చివరికి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు చెల్లించకుండా ‘ప్రజలకు మేలు చేశామని’ చెప్పుకోవడం సిగ్గుచేటు. కానీ మేలు చేశాము కనుక ప్రజలందరూ మళ్ళీ జగనే ముఖ్యమంత్రి కావాలని కోరుకొంటున్నారని మంత్రి అంబటి రాంబాబు చెప్పుకొన్నారు.
నిజానికి జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకొంటున్నారో లేదో ఎన్నికలు జరిగితే కానీ తెలీదు. కానీ జగన్ ముఖ్యమంత్రి కావాలని మంత్రులు, వైసీపి ఎమ్మెల్యేలే కోరుకొంటున్నారని వారి మాటలతోనే తెలుస్తోంది. ఎలాగూ తమ పనితీరుతో ప్రజలను ఎలాగూ మెప్పించి గెలవలేరు. కనుక జగన్ ఫోటోతోనే మేమందరం మళ్ళీ గెలుస్తామని మంత్రులు సైతం నిసిగ్గుగా చెప్పుకోవడం అందరూ వింటూనే ఉన్నారు. ‘మా నమ్మకం… మా భవిష్యత్ నువ్వే జగన్’ అని వారిచేతే జగన్ చెప్పిస్తున్నారు కూడా. కనుక జగన్ ముఖ్యమంత్రి కావాలని, అయితేనే మళ్ళీ తమకి మంత్రి పదవులు, అధికారం లభిస్తాయని వైసీపిలో అందరికీ తెలుసు. కనుకనే ఈ పాట పడుతున్నారనుకోవచ్చు.
కానీ జగన్ తన మంత్రులు, ఎమ్మెల్యేలపై నమ్మకం లేక పక్కన పెట్టి కొత్తవారిని తీసుకొంటుంటే, మంత్రి అంబటి రాంబాబు ఇంకా ఈవిదంగా మాట్లాడుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశః రేపు ఆయనని కూడా జగన్ పక్కన పెట్టి వేరే వారికి టికెట్ ఇస్తే అంబటికి తన పరిస్థితి అర్దమవుతుందేమో?
ఓ పక్క తమ అధినేత తమకే పొగ పెడుతుంటే, మంత్రి అంబటి టిడిపి, జనసేనల పొత్తుల గురించి మాట్లాడుతుండటం ఇంకా విడ్డూరంగా ఉంది. చంద్రబాబు నాయుడు నిజంగా రాష్ట్రానికి ‘మేలు చేస్తే’ టిడిపి ఒంటరిగా ఎందుకు పోటీ చేయడం లేదు?దమ్ముంటే పోటీ చేయాలని అంబటి రాంబాబు సవాలు విసిరారు.
ఎలాగూ వాటిని చిత్తుచిత్తుగా ఓడించేస్తామని చెప్పుకొంటునప్పుడు మళ్ళీ టిడిపిని ఒంటరిగా పోటీ చేయాలని సవాళ్ళు విసరడం దేనికి?అంటే అవి రెండూ కలిసి పోటీ చేస్తే వాటి చేతిలో ఓడిపోతామనే భయంతోనే అని అర్దమవుతుంది.
ఈ భయంతోనే దాదాపు రెండేళ్ళుగా వాటిని దూరంగా ఉంచేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా వైసీపి భయపడుతున్నట్లే అవి పొత్తులు పెట్టుకొని ఎన్నికలకి సిద్దం అవుతుండటంతో వైసీపి అధినేతతో సహా అందరూ ఆందోళనచెందడం సహజమే.
ఇప్పుడు ఎన్నికలలో ఓడిపోతామనే భయంతోనే వైసీపి ఎమ్మెల్యేలను మార్చేసుకొంటూ, ఇలా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం వైసీపి నేతలకే చెల్లు. కేసీఆర్, కేటీఆర్ కూడా చివరి వరకు ఇలాగే మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. కానీ చివరికి ఏమయ్యారో తెలుసు కదా?
The TDP, Jana Sena and BJP scripted a major victory in the 2024 Andhra Pradesh…
Chiranjeevi's Vishwambhara has been waiting for its theatrical release for a long time. Fans are…