
పూలమ్మినా, పాలమ్మినా…కష్టపడ్డా కాలేజీలు పెట్టినా..ఫేమస్ అయ్యా! అంటూ నిజంగానే ఫేమస్ అయ్యారు మల్లారెడ్డి. బిఆర్ఎస్ పార్టీ తరుపున రాజకీయాలలో ఉంటూ రాజకీయంగా కన్నా తన ప్రసంగాలతోనే ప్రజలలో గుర్తింపు తెచ్చుకున్నారు మల్లారెడ్డి.
ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుండడంతో ఇక తన ప్రసంగాలతో కాకుండా ప్రజలను డబ్బులతో ప్రలోభపెట్టి ఫేమస్ అయ్యే పనిలో నిమగ్నమయ్యారు మల్లారెడ్డి. మేడ్చెల్ నియోజక వర్గంలో ఓటర్లకు డబ్బులు పంచుతూ కెమెరా కంటికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అడ్డంగా దొరికిపోయారు మల్లారెడ్డి కళాశాల సిబ్బంది. అలాగే అదే ప్రాంతంలో కారులో డబ్బు సంచులతో సిఐ అంజిత్ రావు కాంగ్రెస్ నాయకులకు పట్టుబడ్డారు. ఈ డబ్బంతా కూడా మల్లారెడ్డి కి సంబంధించిందే అంటూ ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు.
తాజాగా మల్లారెడ్డి కాలేజీ గ్రౌండ్లో జరిగిన ఆనిమల్ సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతూ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బిసినెస్ మాన్ సినిమా చూసి ఇన్ స్పైర్ అయ్యి రాజకీయాలలోకి వచ్చా అంటూ చెప్పిన మల్లారెడ్డి ఓట్ల కొనుగోలు కూడా ఆ సినిమాను చూసి కాపీ కొట్టానంటారో లేక పూలమ్మినా, పాలమ్మినా,కష్టపడినా,కాలేజీలు పెట్టినా…. వ్యాపారం చేసినా… ఆ సొమ్ముతో ఓట్లు కొంటున్నా బాయి. నా డబ్బు నా ఇష్టం అందులో కాంగ్రెస్ పార్టీ నాయకులకేం సంబంధం అంటారేమో చూడాలి.
Rajinikanth's most anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set for a…
Vijay’s rise to power in Tamil Nadu has once again brought the spotlight on actors…