మీర్జాపూర్ అనే వెబ్ సిరీస్ లాక్ డౌన్ టైంలో రిలీజయ్యి.. నెట్టింట్లో బ్లాక్ బస్టర్ అయ్యింది. దేశం మొత్తం మీర్జాపూర్ డైలాగ్స్ & మీమ్స్ తో ఊగిపోయింది. రెండో సీజన్ కూడా అదే స్థాయి విజయాన్ని సాధించేసరికి అమెజాన్ ప్రైమ్ సంస్థ అత్యాశకి పోయి మూడో సీజన్ ని రిలీజ్ చేసి ఆడియన్స్ తోనే తిట్టించుకున్నారు.
అయితే.. ఆ సిరీస్ కి మార్కెట్ లో ఉన్న డిమాండ్ చూసి దాన్ని సినిమాగా మలిచారు. సిరీస్ లో ఉన్న క్యారెక్టర్స్ తోనే సినిమాని తెరకెక్కించారు. సెప్టెంబర్ 4న సినిమా రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. నిన్న ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. అయితే.. హిందీతోపాటు తెలుగు వెర్షన్ రిలీజ్ చేసిన మీర్జాపూర్ టీమ్, తమిళ ట్రైలర్ మాత్రం రిలీజ్ చేయలేదు. టీజర్ నుండే ఈ ఫార్మాట్ ను ఫాలో అవుతున్నారు మేకర్స్.
అందుకు కారణం లేకపోలేదు. మీర్జాపూర్ సీజన్ 3 లో రౌడీలందరినీ బాహుబలి అని సంబోధిస్తుంటారు. అన్నీ భాషల్లో బాహుబలి అనే ఉంటుంది, ఒక్క తమిళంలో తప్ప. ఆ సీజన్ 3 టైంలో మేకర్స్ & లోకలైజేషన్ టీమ్ తో చాలా విభేదాలు వచ్చాయట. ఇప్పుడు మీర్జాపూర్ సినిమా విషయంలోనూ అదే కంటిన్యూ అయ్యిందట. దాంతో డైరెక్టర్ & రైటర్ టీమ్ అసలు తమిళ వెర్షనే వద్దు అని ఫిక్స్ అయ్యారట.
కానీ.. పైకి మాత్రం తమిళ డబ్బింగ్ కి ఎక్కువ ఖర్చు అవుతుంది, ఆ భాషలో బాక్సాఫీస్ రిటర్న్ అంత ఉండవు అని చెబుతున్నారు. కానీ.. అసలైన కారణమైతే డబ్బింగ్ విషయంలో తమిళ రైటర్స్ చూపించిన వ్యతిరేకత అనే తెలుస్తోంది.
లేకపోతే.. అమెజాన్ లాంటి సంస్థ ఒక భాషలో డబ్బింగ్ చేస్తే అయ్యే 20 లక్షల ఖర్చుకి వెనకాడుతుందా? ఈ తమిళోళ్లతో ఎందుకొచ్చిన గొడవ, బాహుబలి అనే పదమే పడనివ్వరు, ఇక సినిమాని ఆడనిస్తారా? అనే సందేహంతోనే సెప్టెంబర్ 4న తమిళంలో చెప్పుకోదగ్గ సినిమాలేమీ లేకపోయినా.. మీర్జాపూర్ సినిమాని కేవలం హిందీ, తెలుగు భాషలకే పరిమితం చేశారు.




