
ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఏ-4గా ఉన్న మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం ఒక ఎత్తు అయితే, అయన అరెస్టుని ఖండిస్తూ వైసీపీ నేతలు చేస్తున్న తీవ్ర విమర్శలు, నిరసనలు ర్యాలీలు ఎదుర్కోవడం మరో ఎత్తుగా మారింది కూటమి ప్రభుత్వానికి.
ఇక మిథున్ రెడ్డి తనకు జైలులో కావలసిన వస్తువులు, కల్పించాల్సిన సౌకర్యాల జాబితా చాలా పెద్దదే ఉంది. ముందుగా ఆయన ఇచ్చిన జాబితా చూద్దాం. 1. కొత్త పరుపు, మంచం, దోమతెర, 2 బల్ల, కుర్చీ, 3. పత్రికలు, తెల్లకాగితాలు, 4 వాకింగ్ షూస్, 5. మందులు, 6. ఇంటి నుంచే భోజనం, అల్పాహారం, కిన్లే వాటర్ బాటిల్స్, 6. వెస్ట్రన్ కమోడ్ ఉన్న స్పెషల్ సెల్, 7. ఒక సహాయకుడు.
ఇన్ని సౌకర్యాలు కల్పిస్తామంటే మమ్మల్ని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టమని నిరుపేదలు కోరినా ఆశ్చర్యం లేదు. సిఎం చంద్రబాబు నాయుడుని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఇలాంటి జాబితా ఇవ్వలేదు. షరతులు పెట్టలేదు. తనని కొన్ని రోజులు ఒంటరిగా నిర్బందించారని, కొన్ని రోజులు వెలుతురు లేని చీకటి గదిలో నిర్బందించారని సిఎం చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పారు. తన గదిలో దోమలు కుడుతున్నాయని పిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు. ఎన్నికలలోగా రాష్ట్రంలో టీడీపిని తుడిచిపెట్టేయాలంటే చంద్రబాబు నాయుడుని శారీరికంగా, మానసికంగా క్రుంగిపోయి అనారోగ్యంతో మంచం పట్టేలా చేయాలని జగన్ అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు అటువంటి పరిస్థితిలను కూడా చాలా గుండె నిబ్బరంతో తట్టుకొని బయటపడ్డారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో పరుగులు పెట్టిస్తున్నారు కూడా.
అసలు జైలుకే వెళ్ళనని మొరాయించిన మిథున్ రెడ్డి ఇప్పుడు జైల్లో ఉండాలంటే ఇన్ని సౌకర్యాలు కావాలని పట్టుబడుతున్నారు. మిథున్ రెడ్డి డిమాండ్స్ చూస్తుంటే ఆయనని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసిందా లేదా ఆయనే కూటమి ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? అని సందేహం కలుగక మానదు.
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…