బాలకృష్ణకే సాధ్యం కాదేమో! కెవ్వు కేకే!

MLA Nandamuri Bala Krishna Stunned With Little Girl Dialogue Performance In Lepakshi Utsavaluనందమూరి నటసింహం డైలాగ్స్ చెప్తుంటే ఎలా ఉంటాయి… రోమాలు నిక్కపొడుచుకుంటాయి కదా..! కానీ అలాంటి బాలయ్యకే రోమాలు నిక్కపొడుచుకునే విధంగా ఓ చిన్నారి చెప్పిన డైలాగ్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. గుక్క తిప్పుకోకుండా దాదాపు 5 నిముషాల పాటు బాలకృష్ణ నటించిన సినిమాలలోని పాపులర్ డైలాగ్స్ ను ఒక దాని వెంట మరొకటి చెప్తుంటే… ఎంజాయ్ చేయడం బాలయ్య వంతయ్యింది.

ఈ సంఘటనకు సాక్ష్యంగా నిలిచింది లేపాక్షి ఉత్సవాల వేడుక. స్టేజ్ పై చిన్నారి మైక్ పట్టుకుని అనర్గళంగా డైలాగులు చెప్తుంటే… వింటున్న ప్రజలు ఈలలు, చప్పట్లతో ప్రాంగణాన్ని మారుమ్రోగించారు. బహుశా లేపాక్షి ఉత్సవాలకే హైలైట్ గా నిలిచే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోను చూసిన వారు… ఇంత అనర్గళంగా, స్పష్టంగా మాట్లాడడం బహుశా బాలయ్యకే సాధ్యం కాకపోవచ్చు అని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వీడియోను వీక్షించిన వారు కాదనలేరు మరి!

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories