అవును మరి జగన్ అండ్ కో పవన్ కంటే పేదవారు కదా.?

జగన్ పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నాడు పవన్ అంటూ వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని ఒక్క విషయం మరిచి పోయినట్టున్నారు. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాకా కనీసం ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ప్రతిపక్ష పార్టీ నేతల పై బూతుల దాడులు చేయడానికి తప్ప మరో కారణంగా మీడియా ముందుకు వచ్చారా? అనేది ఒక్క సారి నాని గారు గుర్తుచేసుకుని పక్క వారి పై విమర్శలు చేస్తే బాగుండేది.

తాము చెయ్యరు ఇతరులను చేయనివ్వరు. ఒక వేళ ఎవరైనా ప్రజలకు అండగా నిలబడాలి అనుకుంటే ఇక వారిపై మానసిక దాడికి సిద్దమవడం వైసీపీ పార్టీ నాయకుల నైజం కింద తయారయ్యింది. రాష్ట్రంలో ఎన్ని విపత్తులు వచ్చినా, వర్షాలు లేక పంటలు పండక రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నా నిమ్మకు నీరెత్తిన చందంగా ప్రతిపక్షాల మీద విమర్శలు చేస్తూ సమస్యను పక్క దారి పట్టించడం ఒక్క వైసీపీ పార్టీకే చెల్లింది.

ADVERTISEMENT

విశాఖ ఫిషింగ్ హార్బర్ లో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు ప్రభుత్వ సాయంతో పాటుగా జనసేన పార్టీ నుండి కూడా పవన్ ప్రతి బాధిత కుటుంబానికి 50 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించి బాధితులకు చెక్కులు కూడా అందించారు. ఆ నేపథ్యంలో పవన్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హార్బర్ లో అసంఘటిత కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయని మత్స్యకార సోదరులు ఆందోళకు గురవుతున్నారని దీని పై ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం పై విమర్శలు చేశారు.

అయితే దీని పై కౌంటర్ వేయటానికి రంగంలోకి దిగారు జగన్ కు నేను పెద్ద పాలేరు లాంటి వాడిని అని సగర్వంగా చెప్పుకున్న పేర్నినాని.ఈయన గారు పవన్ ప్రభుత్వం పై చేసిన విమర్శలకు కౌంటర్ వేస్తే ఎవరు తప్పుబట్టారు. కానీ దాన్ని కులాలకు, ఇతర పార్టీ అధినేతలకు ఉదాహరించి ఆర్జీవీ తరువాత నేనే దేశంలో అందరికంటే తెలివైనవాడిని అనే భావనలో ఏదేదో మాట్లాడుతూ ఉంటారు.

పవన్ విమర్శించింది ప్రస్తుత ప్రభుత్వ విధానాల మీద ఈయన గారి కౌంటర్లేమో ఇలా…, పవన్ ఏనాడైనా కాపులను మనుషులుగా చూసారా? కాపుల ఓట్లను చంద్రబాబు కాళ్ళ ముందు తాకట్టు పెట్టి టీడీపీ పార్టీ గెలుపు కోసం ఆరాటపడుతుంటావు. గతంలో బాబు పల్లకి మోసిన నువ్వు ఇప్పుడు లోకేష్ పల్లకి మోయడానికి సిద్దపడ్డావు అంటూ ఆవు పాఠం చదివి వెళ్లిపోయారు. పవన్ కు డబ్బులు లేవండం అబద్దమే, డబ్బులు లేకపోతే స్పెషల్ ఫ్లయిట్ లో ఎలా తిరుగుతున్నారు అంటూ ప్రశ్నించిన పేర్నినాని ఇక్కడ మరో విషయం మళ్ళీ మర్చిపోయారు.

ఒక సెలబ్రెటీగా, సినీ ఇండస్ట్రీలో ఒక స్టార్ యాక్టర్ గా ఉన్న పవన్ కు ప్లైట్లలో తిరిగేంతగా ఆర్థిక స్తోమత ఉండదా? దాని కోసం కూడా పవన్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి విరాళం తీసుకోవాలా?అధికారంలో ఉండి పదవులను అడ్డుపెట్టుకొని ఇసుక నుండి మద్యం దాకా దేన్నీ వదలకుండా జగన్ అండ్ కో రాష్ట్రంలో చేస్తున్న అక్రమ దందాలతో వెనకేసుకున్న సొమ్ముతో పోలిస్తే పవన్ కన్నా మీరు పేదవారా?లక్షల కోట్ల అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న జగన్ పార్టీ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల కంటే నిరుపేద పార్టీనా?

అంతేలే 450 కోట్లతో రాష్ట్రంలో మూడో ప్యాలస్ ను నిర్మించుకుంటున్న అతి పేదవాడు జగనే అని ఒక ప్రభుత్వ జీవో తీసుకురావచ్చుకదా మాజీ మంత్రి గారు.అప్పుడు రాష్ట్రంలో ఏవిపత్తు వచ్చిన జగన్ పేదవాడు కాబట్టి ప్రజలకు ఎటువంటి ఆర్థిక సాయం చేయలేక పోతున్నారు అంటూ అధికారికంగా ప్రచారం చేసుకోవచ్చు. ఎన్నికల సమయంలో తప్పా మిగిలిన సమయంలో మాకు ప్రజలకు ఆర్థికంగా సహాయం చేసే అలవాటు లేదని 2024 మార్చ్ ఎన్నికల నాటికి అందరికి అర్ధమవుతుందిలెండి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Rajinikanth’s Jailer 2 Wild Cameo: D Blast in Theaters?

Rajinikanth's most anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar, is gearing up for a…

13 minutes ago

Nana’s Death Deserves Dignity but Can It Erase Allegations?

Nana Patekar passed away in Goa on October 8 at the age of 75 due…

33 minutes ago