
ఎప్పుడూ ఏసీ గదులలో, ఏసీ కార్లల్లో మాత్రమే ఉండే ఈ మహామహులంతా రోడ్ల మీదకు రాగానే సహజంగానే కాళ్ళకు బొప్పలు కడతాయి. ఇలాంటివి సామాన్య ప్రజలకు సర్వ సాధారణం. ఒక విధంగా చెప్పాలంటే అసలు వీటిని లెక్కే చేయరు. కానీ వైసీపీ నేతలకు మాత్రం ఇదో పెద్ద విషయం. అందుకే జగన్ మీడియా వేదికలుగా జగన్ అండ్ రోజా కాళ్ళ దర్శనాలను చేయిస్తున్నారు.
ముఖ్యంగా రోజా అయితే తన కాళ్ళు చూపించాలంటూ చేసిన సైగలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో గత కొన్ని గంటలుగా చక్కర్లు కొడుతోంది. సినిమాలలో అద్భుతంగా నటించే రోజాను ఎలా చూపించారో కెమెరామెన్ మరియు దర్శకులకు బాగా తెలుసు. కానీ పొలిటికల్ కెరీర్ కు వచ్చేపాటికి కెమెరామెన్లు కేవలం న్యూస్ కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు.
ఆ క్రమంలోనే రోజా నడిచి వస్తుండగా, చుట్టుప్రక్కన ఉన్న మందిగాములను మరియు రోజాను చిత్రీకరించే ఉన్న కెమెరామెన్ కు రోజా తన కాళ్ళు చూపించాలంటూ సైగ చేయడం, ఇది కాస్త మీడియాలో రికార్డు కావడంతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినట్లయ్యింది. రోజా సైగల తర్వాత సదరు కెమెరామెన్ కూడా చెప్పులు లేని రోజా కాళ్ళను చూపించడంలో దృష్టి కేంద్రీకరించాడు.
సినిమా రిలీజ్‌కు ముందు నిర్మాత నాగవంశీ పేరు ట్విట్టర్‌లో తెగ తిరుగుతోంది. సినిమా గురించి కాదు. ఆయన వ్యక్తిగత జీవితంపై…
While Sanjay Leela Bhansali is busy completing Love & War, he has been equally working…