
నరేంద్ర మోడీ హైద్రాబాద్ పర్యటన అనంతరం తెలంగాణ రాజకీయాలలో జనసేన పేరు ఉహించని ఒక ఉపద్రవంలా వ్యాపించింది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు వివాదంతో మొదలైన ఈ రచ్చ ఇక అక్కడి నుంచి రోజుకో వివాదంగా మారుతూ చివరికి హైద్రాబాద్ మణికొండలో జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు వరకు వచ్చింది.
అసలు తెలంగాణలో ఊసే లేని జనసేనను ఈ స్థాయికి తీసుకెళ్లిన ఘనత కూడా తెలంగాణ వాదులదే అని చెప్పుకోవాలి. తెలంగాణ రాజకీయ మేధావి పై ఏపీ నాయకుడి విమర్శలా.? తెలంగాణలో ఆంధ్రోళ్ల పెత్తనమా.? అంటూ తెలంగాణ సీనియర్ జర్నలిస్టుల మొదలు అధికార కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే లు మంత్రుల వరకు పవన్ టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెట్టారు.
ఇక తెరాస అంటూ రాజకీయం మొదలుపెట్టిన కవిత ఏకంగా పవన్ తో పాటుగా ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసారు. వీరందరూ ఒక ఎత్తైతే తమ హయాంలో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ని, తెలంగాణ లో పుట్టిన తెలుగు దేశం ను కూడా రాజకీయంగా అణిచివేసిన బిఆర్ఎస్ తెలంగాణ రాజకీయాలలోకి పవన్ ఎంట్రీని తప్పుపట్టింది.
ఇలా తెలంగాణలో ఉన్న ప్రాంతీయ పార్టీల నుంచి కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీ వరకు, తెలంగాణ రాజకీయ విశ్లేషకుల నుంచి తెలంగాణలో కొంతమంది సీనియర్ జర్నలిస్టుల వరకు తెలంగాణ లో పవన పొలిటికల్ ఎంట్రీ పై హద్దులు దాటినా విమర్శలు చేసి పవన్ ను రాజకీయాయంగా రెచ్చకొట్టారు.
ఇప్పుడు పవన్ ఆ విమర్శలకు కౌంటర్ గా, వారి దాడికి సమాధానంగా తెలంగాణలో జనసేన రాజకీయం చేస్తుందని, త్వరలో హైద్రాబాద్ లో జరగబోతున్న GHMC ఎన్నికలలో జనసేన పోటీకి దిగుతుందంటూ ప్రకటించి టి. జనసేన నేతలలో మంచి జోష్ నింపారు.
అయితే ఇన్నాళ్ళుగా సైలెంట్ గా ఉన్న పవన్ ఒక్కసారిగా తెలంగాణలో యాక్టీవ్ అయ్యేందుకు కారణాలేమిటి.? అసలు పవన్ వెనుక ఎవరున్నారు.? తెలంగాణలో జనసేన తరుపున సరైన నాయకుడు కూడా లేరు, కానీ ఇప్పుడు ఒక్కసారిగా హైద్రాబాద్ మణికొండలో పార్టీ కార్యాలయం రేపుతూ అయ్యింది.
వీటన్నిటిని గమనిస్తే పవన్ పక్కా ప్రణాళిక ప్రకారమే తెలంగాణలో జనసేనను యాక్టీవ్ చేస్తున్నారా.? కాంగ్రెస్, కవిత, మరికొంతమంది తెలంగాణ వాదులు ఆరోపిస్తున్నట్టుగా పవన్ వెనుక ప్రధాని మోడీ ఉన్నారా.? ఆయన ఆదేశాలతోనే పవన్ ఆవేశంగా తెలంగాణ రాజకీయాలలోకి అడుగు పెడుతున్నారా.?
పవన్ ను తెలంగాణకి తేవాలని బీజేపీ భావిస్తుందా,? లేదా పవన్ ఛరిష్మా తో తెలంగాణలో బీజేపీ ని బలోపేతం చెయ్యొచ్చని ఆశిస్తుందా.? అసలు తెలంగాణ రాజకీయాలలో జనసేన ప్రభావం చూపిస్తుందా.? ఇప్పటికి ఏపీలో క్షేత్ర స్థాయిలో బలపడలేని జనసేన తెలంగాణ రాజకీయాలను మార్చగలదా.?
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…