Telugu

పన్నెండేళ్ల అధికారానికి..పరీక్షలు.?

దేశంలో వరుసగా మూడోసారి బీజేపీ ని అధికారంలోకి తెచ్చి హ్యాట్రిక్ ప్రధానిగా భారతదేశ రాజకీయ చరిత్రలో సరికొత్త చరిత్రను సృష్టించిన మోడీ ఇప్పుడు ఒకే ఒక్క ఉద్యమం తో ఆలోచనలో పడ్డారా.? ఇన్నాళ్ళుగా బీజేపీ ఆడిందే ఆట పాడిందే పాట, మోడీ చెప్పిందే వేదం అన్నట్టుగా సాగిన బీజేపీ ప్రభుత్వ పాలనలో ఇప్పుడు సీజేపీ పేరుతో మరోకొత్త అధ్యాయం మొదలయ్యిందా.?

ప్రస్తుతం ఢిల్లీ జంతర్ మంతర్ లో కనిపిస్తున్న దృశ్యాలు, వినిపిస్తున్న వార్తలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ట్రంప్ టారీఫ్ల ప్రకటనతో మోడీ వేసిన ఆ ఒక్క వెనకడుగు ఇప్పుడు ఒక్క్కొక్కటిగా వెనక్కి లాగుతుందా.? తన ఇన్నాళ్ల ప్రధాని జీవితంలో మోడీ ఇంతవరకు ప్రత్యర్థుల నుంచి ప్రజల నుంచి పెద్దగా రాజకీయ ఒత్తిడిని ఎదుర్కోలేదు.

ADVERTISEMENT

‘నోట్ల రద్దు’ వంటి కీలక అంశాన్ని కూడా మోడీ ఒకేఒక్క వీడియో సందేశంతో ప్రకటించేసారు. ఆ ఒక్క నిర్ణయం దేశం మొత్తాన్ని రోడ్డు మీద క్యూ లో నిలబెట్టింది. అయినా కూడా దేశ ప్రజలు మోడీ వెంటే అడుగేశారు, బీజేపీ కే జై కొట్టారు. మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఈ పన్నెండేళ్లలో ‘GST’ మొదలు ‘ఆర్టికల్ 370 D’ రద్దు వరకు అనేక సంచలనమైన నిర్ణయాలు తీసుకున్నారు.

అయినా కూడా ఎక్కడ బీజేపీ కి వ్యతిరేకంగా, మోడీ కి ప్రతికూలంగా ఒక్క నిరశన కార్యక్రమం కూడా జరగలేదు. ఇక హిందు – ముస్లిం ల మధ్య దశాబ్దాలుగా సాగుతున్న ‘అయోధ్య రామ మందిరం’ వంటి సున్నితమైన అంశాన్ని కూడా మోడీ సర్కార్ చాలా కూల్ గా డీల్ చేసింది. ఎన్నో దశాబ్దాల హిందువుల రామమందిర నిర్మాణ కలను సునాయాసంగా నిజం చేసింది.

అటువంటి మోడీ సర్కార్ ఇప్పుడు నీట్ పరీక్షా పత్రాల లీకేజ్ అంశంలో అటు ప్రతిపక్షాల నుంచి ఇటు సామాన్య ప్రజానీకం వరకు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది. పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ నానాటికి బలపడుతున్న ఈ తరుణంలో ప్రధాని మోడీ తగ్గి నెగ్గుతారా.? లేదా తగ్గేదెలా అంటూ ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకుంటారా.?

ఈ విషయంలో బీజేపీ ముందున్న అగ్నిపరీక్ష లు చాలానే ఉన్నాయి. ఎటువంటి వివాదాలు రాకుండా సమస్యను చాకచక్యంగా పరిష్కరించాలి. అధికారం అనే ఆయుధాన్ని వినియోగిస్తే చివరికి బీజేపీ రాజకీయంగా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.

నిరశన కారుల డిమాండ్ల తలవగ్గితే బీజేపీ పని ఖతం అనే ఆరోపణలు వెల్లువెత్తడం ఖాయం. అలా అని సమస్యని మరింత జటిలం చెయ్యడం కూడా మోడీ సర్కార్ కు రాజకీయంగా ఎదురుదెబ్బే అవుతుంది. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా మారిన ఇటువంటి సంక్లిష్టమైన పరిస్థితిని మోడీ ఎలా చక్కదిద్దగలరు.? తన పన్నెండేళ్ల అధికారానికి ఇది అగ్నిపరిక్ష అవుతుందా.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

October Visa Bulletin: Relief for EB-2 & EB-3 Applicants?

October marks the beginning of the US federal fiscal year. The reset may restore the…

2 hours ago

BB Telugu: Another Day Of Thrigun Fighting Rohith

One more day has passed in Bigg Boss, and one more day of Thrigun back-pitching…

3 hours ago